నెలసరి నొప్పికి చిట్కాలు.. పెయిన్ కిల్లర్స్ మాత్రం కాదండోయ్!
04 October 2024
TV9 Telugu
TV9 Telugu
కొంతమంది మహిళల్లో పీరియడ్ సమయంలో భరించలేని కడుపునొప్పి వస్తుంది. దాన్ని తగ్గించేందుకు పెయిన్ కిల్లర్స్‌నీ వాడుతుంటారు. అయినా ఫలితం కనిపించదు
TV9 Telugu
మరి కొంతమందికి ఈ సమయంలో తీవ్రమైన కడుపునొప్పితోపాటు అధిక రక్తస్రావం, శారీరక బలహీనత వేధిస్తాయి. అందుకే సీరియడ్స్ సమయంలో తీసుకునే ఆహారంలో పోషకాలపై ఎక్కువ శ్రద్ధ పెట్టాలి
TV9 Telugu
చిప్స్, ఉప్పు, తీపి ఆహారాన్ని ఈ సమయంలో తీసుకోవడం సాధ్యమైనంత వరకు నివారించాలి. ఇవి శరీరంలో నీరు పేరుకుపోయేలా చేస్తాయి. దీంతో శరీరం బరువెక్కుతారు
TV9 Telugu
నెలసరి నొప్పిని తగ్గించే వాటిలో విటమిన్-సి పదార్థాలు ఒకటి. అందుకే ఆ సమయంలో కమలా, నిమ్మకాయ, ఆరెంజ్ వంటివి తీసుకోవాలి. వీటిలో ఉండే మెగ్నీషియం, పొటాషియం, విటమిన్- డి కూడా నొప్పి బాధని తగ్గిస్తాయి
TV9 Telugu
ఈ సమయంలో వ్యాయామానికి దూరంగా ఉంటారు. కానీ తేలికపాటి ఎక్సర్‌సైజులు చేయడం వల్ల నొప్పి నుంచి ఉపశమనం పొందొచ్చు. అంతేకాదు, ఎండార్ఫిన్‌లూ విడుదలవుతాయి. దీంతో తిమ్మిరి కూడా తగ్గుతుంది
TV9 Telugu
అలాగే ఈ సమయంలో చేసే తేలికపాటి వ్యాయామాలు శారీరక నొప్పుల నుంచి ఉపశమనం కలిగిస్తాయి. పీరియడ్స్ సమయంలో ఎక్కువసేపు ఖాళీ కడుపుతో ఉండకూడదు
TV9 Telugu
ఎందుకంటే దీనివల్ల శరీరం మరింత బలహీనంగా మారుతుంది. అయితే పీరియడ్స్ సమయంలో టీ, కాఫీ లేదా కెఫిన్ ఉన్న పానీయాలకు దూరంగా ఉండాలి
TV9 Telugu
పీరియడ్స్ సమయంలో పాల ఉత్పత్తులను తీసుకోకపోవడమే మంచిది. ఇది గ్యాస్, మలబద్ధకం సమస్యను కలిగిస్తుంది. అల్లం టీ వంటి హెర్బల్ టీలు తాగితే ఉపశమనం పొందొచ్చని నిపుణులు చెబుతున్నారు