ఒంటి నొప్పులను సహజంగా చెక్ పెట్టడంలో అల్లం ఉపయోగపడుతుంది. పచ్చి అల్లం ముక్కను ఒక గుడ్డలో కట్టి, వేడి నీటిలో కాసేపు ఉంచిన తర్వాత నొప్పులు ఉన్న చోట పట్టించాలి.
పసుపు కూడా ఒంటి నొప్పులను తగ్గించడంలో ఉపయోగపడుతుంది. పసుపును పాలలో కలుపుకొని తాగాలి. లేదా నొప్పి ఉన్న చోట పసుపు పేస్టును రాసినా ఉపశమనం లభిస్తుంది.
చలి కాలంలో వచ్చే బాడీ పెయిన్స్‌కు ఆపిల్ సైడర్ వెనిగర్ ఉయోగపడుతుంది. వేడి నీటిలో వెనిగర్‌ను వేసుకొని స్నానం చేయడం లేదా ఒక గుడ్డను నీటిలో ముంచి నొప్పులున్న చోట పెట్టాలి.
బెర్రీలను జ్యూస్‌గా చేసుకొని తాడం వల్ల కూడా ఒంటి నొప్పులు దూరమవుతాయని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని మంచి గుణాలు ఇంఫ్లా మేషన్ ను తొలగించడంలో ఉపయోగపడుతుంది.