ఆందోళన, ఒత్తిడి తగ్గించడంలో బెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయి. వీటిలో ఉండే.. యాంటీఆక్సిడెంట్లు, ఫైటోన్యూట్రియెంట్లు ఒత్తిడిని దూరం చేయడంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఒత్తిడిని దూరం చేయడంలో బాదంపప్పు ఎంతగానో ఉపయోగపడుతుంది. ఇందులోని జింక్ మనస్సును ప్రశాంతంగా ఉండచంలో కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు.
నారింజను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి దూరమవుతుంది. వీటివల్ల మెదడులో సెరోటోనిన్ స్రవిస్తుంది. ఈ సెరోటోనిన్ మన శరీరంలో ఆందోళన, ఒత్తిడిని కలిగించే హార్మోన్లను నియంత్రిస్తుంది.
ఒత్తిడిని చిత్తు చేయడంలో ఓట్ కూడా బాగా ఉపయోగపడుతుందని నిపుణులు చెబుతున్ఆనరు. ఒత్తిడి, ఆందోళనకు కారణమయ్యే హార్మోన్లు ఇందులో పుష్కలంగా ఉంటాయి.
జీడిపప్పు కూడా ఒత్తిడిని దూరం చేయడంలో బాగా ఉపయోగపడుతుంది. ఇందులో ఆరోగ్యకరమైన కొవ్వులతో పాటు, ఫైబర్, మెగ్నీషియం అధికంగా ఉంటాయి. ఇవి మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
ఆకు కూరలను ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఒత్తిడి దూరమవుతుందని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా బచ్చలి కూర, పాలకూర వంట ఆకుకూరల్లో ఉండే విటమిన్ బి కాంప్లెక్స్ మానసిక ఆరోగ్యాన్ని కాపాడుతుంది.
ఒత్తిడి నుంచి ఉపశమనం పొందాలంటే డార్క్ చాక్లెట్‌ను తీసుకోవాలి. ఇందులోని కోకో రక్త ప్రసరణను మెరుగురిచి, ఒత్తిడిని దూరం చేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం