వర్షాకాలంలో డెంగీతో జాగ్రత్త.. ప్లేట్‌లెట్స్ సహజంగా పెరగాలంటే!
28 July 2024
TV9 Telugu
TV9 Telugu
వర్షాకాలం వచ్చింది. దానికి తోడు దోమల బెడద ఎక్కువైంది. దీంతో దేశ వ్యాప్తంగా డెంగ్యూ విజృంభిస్తోంది. నిజానికి, డెంగీ జ్వరం నూటికి 99% మందికి పెద్దగా ఇబ్బంది పెట్టకుండానే తగ్గిపోతుంది
TV9 Telugu
ఒక్క శాతం మందిలోనే తీవ్రంగా పరిణమిస్తుంది. ప్లేట్‌లెట్లు తగ్గటం, రక్తం చిక్కపడటం, రక్తస్రావం వంటి చిక్కులకు దారితీస్తుంది. దీంతో మరణం సంభవిస్తుంది
TV9 Telugu
డెంగీకి కారణమయ్యే ఫ్లేవీ వైరస్‌లు ఆడ ఈడిస్ ఈజిప్టై దోమ కుట్టటం ద్వారా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తాయి. ఈ వైరస్‌లలో 4 రకాలున్నాయి. ఒక రకం వైరస్‌తో ఒకసారే డెంగీ వస్తుంది
TV9 Telugu
వర్షాకాలంలో కొన్ని ఆహారపదార్థాలు తినడం వల్ల ప్లేట్‌లెట్ స్థాయిలు పెరుగుతాయంటున్నారు ఆరోగ్య నిపుణులు. డెంగ్యూతో బాధపడేవారు వీటిని తీసుకోవడం వల్ల జయించవచ్చు
TV9 Telugu
వర్షాకాలంలో అనేక రకాల కూరగాయలు మార్కెట్‌లో లభిస్తాయి. వీటిల్లో ఆకుపచ్చ కూరగాయలు ఎక్కువగా తినాలి. ముఖ్యంగా పాలకూరలో విటమిన్ కె ఉంటుంది. ఇది ప్లేట్‌లెట్ పనితీరును పెంచుతుంది
TV9 Telugu
గుమ్మడి గింజల్లో జింక్ పుష్కలంగా ఉంటుంది. ఈ ఆహారాలు ప్లేట్‌లెట్ స్థాయిలను నిర్వహించడానికి కూడా సహాయపడతాయి. అలాగే బొప్పాయి గింజల్లో విటమిన్లు, ఖనిజాలు పుష్కలంగా ఉంటాయి. అందుకే బొప్పాయిని ప్లేట్‌లెట్లను పెంచే పండు అంటారు.
TV9 Telugu
బీట్‌రూట్ దుంప రసం తినడం వల్ల ప్లేట్‌లెట్స్ పెరుగుతాయి. ఇది కాకుండా, ఈ కూరగాయ రక్తాన్ని శుద్ధి చేయడానికి కూడా సహాయపడుతుంది
TV9 Telugu
దానిమ్మలో వివిధ యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి ప్లేట్‌లెట్స్ ఉత్పత్తికి తోడ్పడతాయి. ప్లేట్‌లెట్ దెబ్బతినకుండా నిరోధించడంలో కూడా ఇది కీలక పాత్ర పోషిస్తుంది