ఎక్కువ రోజులు ఆరోగ్యంగా జీవించాలంటే కచ్చితంగా వ్యాయామాన్ని జీవితంలో ఒక భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. కనీసం రోజులో 30 నిమిషాలైనా వ్యాయామం చేయాలి.
మంచి ఆరోగ్యానికి జీర్ణక్రియ ఎంతో ముఖ్యమైంది అందుకే ఫైబర్ ఫుడ్‌ను ఎక్కువగా తీసుకోవాలి. దీనివల్ల జీర్ణ వ్యవస్థ మెరుగువుతుంది.
ఇక ఆహారం, వ్యాయామంతో పాటు నిద్ర కూడా ముఖ్యమే. రోజులో కనీసం 7 నుంచి 8 గంటలపాటు నిద్ర ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
ఆహారం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ప్రాసెస్డ్ ఫుడ్, జంక్ ఫుడ్‌కు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటి స్థానంలో కూరగాయలు, పండ్లను తీసుకోవాలి.
చాలా మంది ఒత్తిడి కారణంగా అనారోగ్యం బారిన పడుతున్నారు. అందుకే ఒత్తిడి నిర్వహణను జీవితంలో ఒక భాగం చేసుకోవాలి. ఇందుకోసం యోగా, మెడిటేషన్ వంటి అలవాటు చేసుకోవాలి.
ఎట్టి పరిస్థితుల్లో పొగాకు దూరంగా ఉండాలి. స్మోకింగ్ చేయడం వల్ల రోజుకింతా ఆయుష్షును తగ్గించుకున్న వాళ్లం అవుతాం. కాబట్టి వెంటనే మానేయాలి.
మద్యం కూడా ఆయుష్షును రోజుకింత తగ్గిస్తుంది. కాబట్టి మద్యపానాన్ని పూర్తిగా మానేయాలి. వీటికి బదులు పండ్ల రసాలను ఆహారంలో భాగం చేసుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.