ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో ఆకుకూరలు కీలక పాత్ర పోషిస్తాయి. ముఖ్యంగా బచ్చలికూర, కాలే, కొల్లార్డ్ గ్రీన్స్ వంటి ఆకు కూరలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు.
క్యారెట్‌లను నిత్యం ఆహారంలో భాగం చేసుకోవడం వల్ల ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉంటాయి. ముఖ్యంగా ఇందులోని విటమిన్ ఏ లంగ్స్ కణజాలాన్ని ఆరోగ్యంగా ఉంచుతుంది.
లంగ్స్ హెల్తీగా ఉండాలంటే టమాటోలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇది ఊపిరితిత్తుల కణజాలాన్ని ఆర్యోగంగా ఉంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది.
బ్రకోలి కూడా ఊపిరితిత్తులకు మేలు చేస్తుంది. ఇందులోని సల్ఫోరాఫేన్ అనే సమ్మేళనం ఊపిరితిత్తుల డీటాక్సిఫై చేయడంలో ఉపయోగపడుతుంది. ఊపిరిత్తుల వాపు తగ్గుతుంది.
మిరియాల్లో పుష్కలంగా ఉండే విటమిన్ సి రోగనిరోధక శక్తిని పెంచుతుంది. ఊపిరితిత్తుల్లో మంటను తగ్గించడంలో మిరియాలు కీలక పాత్ర పోషిస్తుంది.
ఊపిరితిత్తులు ఆరోగ్యంగా ఉండాలంటే ఉల్లిపాయలను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని క్వెర్సెటిన్ యాంటీఆక్సిడెంట్ వాపును తగ్గించడంలో ఉపయోగపడుతుంది.
వెల్లుల్లి కూడా ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుతుంది. ఇందులోని అల్లిసిన్ అనే సమ్మేళనం మేలు చేస్తుంది. అలాగే యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్‌ప్లమేటరీ గుణాలు లంగ్స్‌ను బలంగా మారుస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.