శీతాకాలంలో చల్లగాలుల వల్ల జుట్టు జీవం కోల్పోయి పొడిబారి గడ్డిలా మారుతుంది. ఫలితంగా కుదుళ్లు బలహీనపడి జుట్టు రాలిపోతుంది
చలి బారి నుంచి శిరోజాలను సంరక్షించాలంటే కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు సౌందర్య నిపుణులు. అవేంటో ఇక్కడ తెలుసుకుందాం
కొందరు వారానికి మూడు లేదా నాలుగుసార్లు తరచూ తలస్నానం చేస్తుంటారు. శీతాకాలంలో తలస్నానం మరీ ఎక్కువగా లేదా తక్కువగా చేయడం అంతమంచిదికాదు
వారానికి రెండుసార్లు తలస్నానం చేస్తే సరిపోతుంది. అలాగే తలస్నానానికి ఉపయోగించే షాంపూ కూడా తక్కువ గాఢత కలిగినదై ఉండాలి
తలస్నానానికి ముందు జుట్టుకు కండిషనర్ తప్పకుండా అప్త్లె చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లు బలంగా మారడమే కాకుండా.. షాంపూలో ఉండే రసాయనాల ప్రభావం జుట్టుపై పడదు
చలి కాలంలో వాతావరణం చల్లగా ఉంటుంది కాబట్టి చాలా వేడిగా ఉండే నీళ్లతో స్నానం చేయకపోవడం మంచిది. గోరు వెచ్చని నీటిని ఉపయోగించాలి
ఎక్కువ వేడిగా ఉన్న నీటిని ఉపయోగిస్తే చర్మం, శిరోజాలల్లో ఉండే సహజనూనెల నశించిపోతుంది. ఫలితంగా పొడిగా మారి, నిర్జీవంగా కనిపిస్తాయి
కండిషనర్ పెట్టుకున్న తర్వాత వేడి నీళ్లలో ముంచిన టవల్‌ను తలకు చుట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల కుదుళ్లకు మంచి పోషణ అంది బలం చేకూరుతుంది