మూత్ర విసర్జనకు సంబంధించి సమస్యలకు ప్రధాన కారణం శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు పెరగడమే. దీనివల్ల కిడ్నీలు పాడయ్యే ప్రమాదం కూడా ఉంటుంది.
క్రియాటినిన్ అనేది శరీరంలో పేరుకుపోయే వ్యర్థ పదార్థం. ఇది మూత్రపిండాల ద్వారా బయటకు వెళ్లకుండా.. శరీరంలో పేరుకుపోతుంది.
ఈ సమస్యకు చెక్ పెట్టడానికి తక్కువ ప్రోటీన్ ఉన్న ఆహారాన్ని తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. హై ప్రోటీన్ కారణంగా క్రియాటినిన్ పెరుగుతుంది.
ఇక ఎట్టి పరిస్థితుల్లో డీ హైడ్రేషన్‌కు గురికాకూడదని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ రోజూ కచ్చితంగా 8 నుంచి 10 గ్లాసుల నీటిని తీసుకోవాలని చెబుతున్నారు.
కిడ్నీల ఆరోగ్యం మెరుగ్గా ఉండడానికి, శరీరంలో క్రియాటినిన్ స్థాయిలు కంట్రోల్‌లో ఉండడానికి ఉప్పును తక్కువగా తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
కిడ్నీలు ఆరోగ్యంగా ఉండాలంటే తీసుకునే ఆహారంలో ఫైబర్ శాతం ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఫైబర్ ఉండే ఆకు కూరలు, పండ్లు తీసుకోవాలి.
శారీరకంగా యాక్టివ్‌గా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. ప్రతీరోజూ వాకింగ్, రన్నింగ్‌ను తప్పనిసరిగా అలవాటు చేసుకోవాలని సూచిస్తున్నారు. దీంతో కిడ్నీల ఆరోగ్యం మెరుగవుతుందని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.