చలికాలం వస్తోంది..ఈ జాగ్రత్తలు పాటిస్తున్నారా.?
19 October 2023
చలికాలం వచ్చిందంటే చాలు మొదట చర్మంపైనే ప్రభావం పడుతుంది. అందుకే కొన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటే చర్మాన్ని రక్షించుకోవచ్చు.
ఇక చలికాలంలో ఉదయం వాకింగ్ వంటి చేయడం అంత మంచిది కాదని చెప్పాలి. ఉదయం చలి తీవ్రత తగ్గి సూర్య కిరణాలు పడే సమయంలో వాకింగ్ చేయాలి.
చలికాలంలో విటమిన్ సి ఎక్కువగా ఉండే ఆహారం భాగం చేసుకోవాలి. దీనివల్ల చర్మం పొడిబారకుండా ఉంటుంది. అలాగే సరిపడ నీరు కూడా తీసుకోవాలి.
చలికాలంలో తాజా ఆకు కూరలు తీసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఉసిరికాయలు, బొప్పాయి, ఖర్జూర వంటి పండ్లను డైట్‌లో భాగం చేసుకోవాలి.
ఇక సబ్బుల విషయంలో కూడా చలి కాలం జాగ్రత్తలు తీసుకోవాలి. గ్లిజరిన్ ఎక్కువగా ఉండే సబ్బులను మాత్రమే ఉపయోగించాలి.
పొడి చర్మం ఉన్న వారికి చలికాలంలో ప్రభావం మరింత ఎక్కువపడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి వాళ్లు మాయిశ్చరైజింగ్ కోల్డ్ క్రీమ్‌లను వాడాలి.
చలి కాలంలో వాహనాలు నడిపే వారు కచ్చితంగా హెల్మెట్, మాస్క్ ధరించాలి. చల్లగాలి వేగంగా ముహానికి తగిలితే చర్మం పొడిబారిపోయే ప్రమాదం ఉంటుంది.
చలికాలం కదా అని మరీ వేడి నేటితో స్నానం చేయకూడదు. దీనివల్ల చర్మం పొడిబారుతుంది. కాబట్టి గోరు వెచ్చిని నీటితో స్నానం చేయాలి.
ఇక్కడ క్లిక్ చేయండి..