తరచూ కడుపుబ్బరమా.? ఇలా చేయండి..
20 January 2024
TV9 Telugu
దాదాపు మనం ప్రతీ ఒక్కరం ఏదో ఒక సమయంలో కడుపుబ్బరంతో బాధపడే ఉంటాం. ఇది సర్వసాధారణంగా అందరికీ ఎదురయ్యే సమస్యే.
ఈ సమస్యకు ప్రధాన కారణం అతిగా తినడం లేదా అనారోగ్యకరమైన ఆహారం తీసుకోవడమనే నిపుణులు చెబుతున్నారు.
అలాగే గబగబా తినటం, బద్ధకంగా కూర్చోవటం వంటివీ కడుపుబ్బరానికి దారితీయొచ్చు. ఇంతకీ ఈ సమస్య నుంచి బయట పడాలంటే ఏం చేయాలో ఇప్పుడ చూద్దాం.
తీసుకునే ఆహారాన్ని బాగా నమిలి తినడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల ఆహారం బాగా జీర్ణం కావడానికి ఉపయోగపడుతుంది.
ఒకేసారి ఎక్కువ ఆహారం తీసుకోకుండా కొద్ది కొద్దిగా ఎక్కువసార్లు తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీంతో కడుపు తేలికగా ఉంటుంది.
కందిపప్పు వవంటి వాటిని వంట చేసే ముందు నానబెట్టాలి ఇలా చేయడం వల్ల పప్పు త్వరగా ఉడకడమే కాకుండా.. తేలిక జీర్ణమవుతుంది.
పెరుగును అలవాటు చేసుకోవాలి. పెరుగు పేగుల్లో మంచి బ్యాక్టీరియా వృద్దికి తోడ్పడుతుంది. జీర్ణవ్యవస్థ సక్రమంగా పనిచేస్తుంది.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..