ఆరోగ్యంగా ఉండాలా.? అయితే ఇలా చేయండి.. 

24 November 2023

దాదాపు అన్ని అనారోగ్య సమస్యలకు శారీరక శ్రమ లేకుపోవడమే ప్రధాన కారణం కాబట్టి రోజుకు కనీసం 15 నిమిషాలైన నడవడం అలవాటుగా మార్చుకోవాలి.

లిఫ్ట్‌లు, ఎలివేటర్లు ఉన్నా మెట్లు ఎక్కడం అలవాటుగా చేసుకోవాలి. రోజులో కనీసం 50 మెట్లు ఎక్కాలి దీనిద్వారా మొకాళ్ల నొప్పులు దరిచేరవు. 

పరిగెత్తడమే మర్చిపోయారు. రోజులో కనీసం 2 కిలోమీటర్లైనా పరిగెత్తడం అలవాటు చేసుకోవాలి. దీనివల్ల గుండె, మెదడు ఆరోగ్యం మెరుగవుతుంది. 

ఎక్కువసేపు కూర్చోవడం వల్ల ఎన్నో శారీరక సమస్యలు వస్తాయి. కాబట్టి కనీసం ప్రతీ 30 నుంచి 45 నిమిషాలకు ఒకసారి అలా లేచి నడవాలి. 

స్కూటీలు, బైక్‌లు అందుబాటులోకి రావడంతో సైకిల్‌ తొక్కడమే మర్చిపోయారు. అయితే వీలైతే సైక్లింగ్‌ అలవాటు చేసుకోవాలి. దీనివల్ల శారీరక శ్రమ పెరుగుతుంది.

ఇక వ్యాయామాలు చేయడానికి కచ్చితంగా జిమ్‌కు వెళ్లాల్సిన అవసరం లేదు. ఇంట్లోనే ఉంటూ స్ట్రెచ్‌, స్ట్రెంత్ వంటివి చేయడం అలవాటుగా మార్చుకోవాలి. 

కూల్‌ డ్రింక్స్‌, ప్యాక్ట్‌ ఫ్రూట్ జ్యూస్‌లు, స్వీట్లను తీసుకోకూడదు. వీటివల్ల షుగర్‌, ఊబకాయం వంటి సమస్యలు వచ్చే ప్రమాదం ఉంటుంది. 

ఇక ఉప్పును వీలైనంత వరకు తగ్గించాలి. ఉప్పు ఎక్కువగా తీసుకుంటే రక్తపోటు, గుండెపోటు సంబంధిత సమస్యలు వెంటాడుతాయి.