ఎలా నిద్ర పోతున్నామనేది ముఖ్యం.. 

05 December 2023

ఎంతసేపు పడుకున్నాం అనేది ముఖ్యం కాదు. ఎలా పడుకున్నామనేది పరిగణలోకి తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

మనం రాత్ర నిద్రించే సమయంలో పడుకునే విధానం సరిగ్గా లేకపోతే శరీరంపై తీవ్ర ప్రభావం పడుతుందని హెచ్చరిస్తున్నారు. 

మరీ చిన్న దిండును, మరీ పెద్ద దిండును వాడకూడదు. ఇక తలకింద చేయి పెట్టుకొని ఎట్టి పరిస్థితుల్లో పడుకోకూడదు.. దీంతో శరీరానికి రక్తప్రసరణ సరిగా జరగదు.

ఇక దిండును ఉపయోగించే విధానంలోనూ కొన్ని పద్ధతులు పాటించాలి. తల దిండుకు చివరల్లో కాకుండా మధ్యలో తల పెట్టి పడుకోవాలి. 

మనలో చాలా మంది తలమీద చేయి పెట్టుకొని పడుకుంటుంటారు. ఇలా చేస్తే దీర్ఘకాలంగా మెడ, అరచేయి నొప్పి వంటి సస్యలు రావొచ్చు. 

ఇక కొందరు పొట్టలో కాళ్లు ముడుచుకొని పడుకుంటారు. ఇలా దీర్ఘకాలం అయితే వెన్నెముక ఇబ్బందులు వచ్చే అవకాశం ఉంటుంది. 

పరుపు విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. పరుపు మరీ మెత్తగా, మరీ గట్టిగా ఉండకుండా చూసుకోవాలి. దీనివల్ల నముడు నొప్పి సమస్య వేధిస్తుంది. 

వీలైనంత వరకు వెల్లకిలా పడుకోవడం అలవాటు చేసుకోవాలి. గురుత్వాకర్షణ వల్ల శరీరం సమతలంగా ఉంటుంది.