భోజనం చేయగానే ఎట్టి పరిస్థితుల్లో కూర్చోకూడదని నిపుణులు చెబుతున్నారు. భోజనం చేసిన తర్వాత కనీసం కొద్దిసేపు అయినా నడవడం అలవాటు చేసుకోవాలి.
గబిజిబీ జీవితంలో చాలా మంది ఉదయం బ్రేక్ ఫాస్ట్ చేయడం మానేస్తున్నారు. అయితే టిఫిన్ చేయడం మానేస్తే కష్టాలు తప్పవని చెబుతున్నారు. గ్యాస్, ఎసిడిటీ వంటి సమస్యలు వస్తాయి.
రాత్రళ్లు ఆలస్యంగా నిద్రపోవడం, ఉదయం లేటుగా నిద్రలేవడం ఇటీవల కామన్‌గా మారింది. అయితే ఈ అలవాటు వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. రాత్రి త్వరగా పడుకొని ఉదయం త్వరగా నిద్రలేవాలి.
శారీరక ఆరోగ్యం ఎంత ముఖ్యమో మానసిక ఆరోగ్యం కూడా అంతే ముఖ్యంగా. యోగా, మెడిటేషన్ వంటివి అలవాటు చేసుకోవాలి. రోజులో కనీసం 30 నిమిషాలు మెడిటేషన్ చేయాలి.
ఉదయం నిద్రలేచిన వెంటనే గోరువెచ్చని నీటిని తాగడం అలవాటు చేసకోండి. అనంతరం కొద్దసేపు బ్రీతింగ్ ఎక్సర్‌సైజ్ చేయండి. ఇలా చేస్తే ఆరోగ్యం మెరుగవుతుంది.
నీరు శరీరానికి ఎంతలా మేలు చేస్తుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రోజుకు కనీసం మూడు లీటర్ల నీరు తాగడం వల్ల ఆరోగ్యం మెరుగవుతుంది.
రాత్రిపూట వీలైనంత త్వరగా భోజనం చేయాలని నిపుణులు చెబుతున్నారు. రాత్రి భోజనం చేసిన తర్వాత పడుకోవడానికి కనీసం మూడు గంటలు గ్యాప్ ఉండాలని చెబుతున్నారు.
రోజు మజ్జిగ తాగడం అలవాటు చేసుకోవాలి. నిత్యం క్రమంతప్పకుండా మజ్జిగను తీసుకుంటే జీర్ణక్రియ సమస్యలు దరిచేరవు. పొట్ట సంబంధిత సమస్యలు దరిచేరవు.