లో బీపీతో బాధపడుతున్నారా.? 

Narender Vaitla

05 November 2024

లో బీపీతో బధపడేవారు కచ్చితంగా క్రమంతప్పకుండా తగినంత నీటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. రెగ్యులర్‌గా రోజు 2 నుంచి 3 లీటర్ల నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.

తీసుకునే ఆహారం విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలి. ఆహారంలో కాస్త ఉప్పు ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

లో బీపీతో బాధపతుంటే కచ్చితంగా వ్యాయామాన్ని అలవాటు చేసుకోవాలి. ప్రతీ రోజూ ఉదయం కచ్చితంగా వాకింగ్ చేయాలి. అలాగే మెడిటేషన్, యోగా అలవాటు చేసుకోవాలి.

ఆల్కహాల్‌, స్మోకింగ్ వంటి అలవాట్లు ఉంటే వెంటనే మానేయాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి లో బీపీ సమస్యను మరింత పెంచే అవకాశం ఉంటుందని అంటున్నారు. 

ఇక ఆహారం తీసుకునే విషయంలో కూడా కొన్ని మార్పులు చేయాలి. ఒకేసారి ఎక్కువ మోతాదులో కాకుండా, తక్కునగా ఎక్కువసార్లు భోజనం చేయడం అలవాటుగా మార్చుకోవాలి.

లో బీపీతో బాధపడుతుంటే నీళ్లలో నిమ్మకాయ రసం తీసుకొని అందులో అర టీస్పూన్ ఉప్పు వేసి తాగాలి. ఇలా చేస్తే లో బీపీ వెంటనే అదుపులోకి వస్తుంది.

లో బీపీతో బాధపడేవారు తీసుకునే ఆహారంలో డ్రై ఫ్రూట్స్‌ను బాగం చేసుకోవాలి. ముఖ్యంగా బాదం, ఎండుద్రాక్ష వంటి డ్రై ఫ్రూట్స్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని అంటున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.