చలికాలం జుట్టు రాలుతోందా.? ఇలా చేయండి.. 

08 January 2024

TV9 Telugu

చలికాలంలో తలపై ఉండే చర్మం డ్రై మారడం వల్ల జుట్టు రాలడం ఎక్కవవుతుంది. దీనికి ప్రధాన కారణం తలపై చర్మం పెచ్చులుగా మారడమే. 

తలపై తరచూ నూనె పెట్టడం వల్ల ఈ సమస్యను కొందమేర నివారించవచ్చు. అయితే శరీరంలో నుంచి కూడా నూనెలను అందించడానికి కొన్ని ఫ్యాటీ యాసిడ్స్‌ కావాలి.

ఇందుకోసం ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్‌ ఎక్కువగా లభించే ఆహారాన్ని తీసుకోవాలి. ముఖ్యంగా వాల్‌నట్స్‌, అవిసె, గుమ్మడి గింజాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. 

పెచ్చులుగా మారి పోయిన చర్మం మళ్లీ ఏర్పడడానికి.. ప్రొటీన్లు అవసరం. ఇందుకోసం కోడి మాంసం, చేపలు, పాలు, పాల ఉత్పత్తుల్లాంటి వాటిని తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. 

చర్మం తేమగా ఉంచడంలో విటమిన్‌-ఎ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం రెట్‌, గుమ్మడి, పాలకూర, ఇతర ఆకుకూరలు, రంగుల కూరగాయలను తీసుకోవాలి. 

చర్మంలోని కొత్త కణాల పెరుగుదలలో ఫోలిక్‌ యాసిడ్ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందుకోసం నట్స్‌, సోయా, ఆకుకూరలను డైట్‌లో భాగం చేసుకోవాలి. 

ఇక చుండ్రును తగ్గించడంలో విటమిన్‌ బి6 ఉపయోగడుతుంది. ఇందుకోసం గోధుమ, జొన్నలాంటి ధాన్యాలతో పాటు గుడ్డు పచ్చసొన, మటన్‌ లివర్‌ను తీసుకోవాలి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.