చలికాలం అల్లం టీని అలవాటు చేసుకోవాలి. దీంతో ఇమ్యూనిటీ పెరగడంతో పాటు దగ్గు, జలుబు, ఫ్లూ వంటి లక్షణాల నుంచి ఉపశమనం లభిస్తుంది.
పాలు, పసుపు కలిపి తీసుకోవడం వల్ల కూడా మంచి ఫలితం లభిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడంలో వీటిది కీలక పాత్ర. పసుపులోని యాంటీ ఆక్సెడెంట్స్ శరీరానికి మేలు చేస్తాయి.
శరీరంలోని శ్లేష్మాన్ని తొలగించడంలో నిమ్మకాయ రసం ఉపయోగపడుతుంది. తేనె, నిమ్మకాయ రసాన్ని కలిపి తీసుకుంటే శరీరంలోని వైరస్‌లు బయటకు పోతాయి.
విటమిన్ సి కి పెట్టింది పేరైన ఉసిరితో కూడా ఎన్నో లాభాలు ఉన్నాయి. ఇది శరీరంలోని తెల్ల రక్త కణాల సంశ్లేషణను పెంచుతుంది. వ్యాధులతో పోరాడే శక్తినిస్తుంది.
చలికాలం వ్యాధులకు చెక్ పెట్టడంలో ఆవిసె గింజలు ఎంతో ఉపయోగపడుతాయి. ఇందులోని ఒమేగా 3 యాసిడ్స్ శరీరాన్ని రోగాల నుంచి రక్షిస్తాయి.
దగ్గు ఎంతకీ తగ్గకపోతే పసుపు, ఉప్పు కలిపిన గోరువెచ్చని నీటిని పుకిలించి ఉంచాలి. దీంతో గొంతుకు ఉపశమనం లభించడంతో పాటు దగ్గు తగ్గుతుంది.
ఇక తులసి ఆకులను నీటిలో మరిగించి టీలా తీసుకున్నా మంచి ఫలితం ఉంటుంది. ఇక దగ్గు ఉన్నప్పుడు గోరు వెచ్చని నీటిని తాగడం అలవాటు చేసుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.