చదివింది గుర్తుండడం లేదా.? 

06 January 2023

పరీక్షలు అనగానే చాలా మంది నిద్ర లేకుండా అదే పనిగా చదువుతుంటారు. అయితే కచ్చితంగా సరిపడ నిద్ర ఉండాలి. కనీసం 7 గంటలు నిద్రపోతేనే మనస్సు ప్రశాంతంగా ఉండి, చదివింది గుర్తుంటుంది. 

ఇక పరీక్షల సమయంలో తీసుకునే ఆహారం విషయంలోనూ జాగ్రత్తగా ఉండాలని నిపుణులు చెబుతున్నారు. మంచి న్యూట్రిషియన్‌ ఫుడ్‌ను తీసుకోవడం వల్ల మెదడు షార్ప్‌గా మారుతుందని చెబుతున్నారు. 

పరీక్షల సమయంలో వ్యాయామం చేయడాన్ని అలవాటు చేసుకోవాలి. క్రమంతప్పకుండా వ్యాయామం చేయడం వల్ల మానసిక ప్రశాతంత లభించి ఏకాగ్రత పెరుగుతుంది. 

కొందరు అదే పనిగా చదువుతూనే ఉంటారు. అయితే మధ్య మధ్యలో బ్రేక్‌ తీసుకోవడం అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల ఒత్తిడి పెరగకుండా ఉంటుందనంటున్నారు. 

శరీరానికి సరిపడ నీరు అందకపోయినా ఒత్తిడి పెరుగుతుంది. కాబట్టి పరీక్షల సమయంలో కచ్చితంగా సరిపడ నీరు తీసుకోవాలి. రోజులో కనీసం 7 నుంచి 8 గ్లాసుల నీరు తాగాలి. 

చాలా మంది సమయ పాలన లేక సిలబస్‌ను పూర్తి చేయరు. అలా కాకుండా పరీక్షకు తగ్గట్లు ఒక చక్కటి ప్లాన్‌ వేసుకొని టైమ్‌ మ్యానేజ్‌మెంట్ చేసుకోవాలి.

పరీక్షల సమయంలో శారీరక వ్యాయామానికి ఎంత ప్రాధాన్యత ఇస్తారో మానసిక వ్యాయామానికి అంతే ప్రాధాన్యత ఇవ్వాలి. యోగా మెడిటేషన్‌ వంటి వాటితో మనస్సును ప్రశాంతంగా మారుతుంది. 

నిత్యం పాజిటివ్‌ ఆలోచనతో ఉండాలి. పరీక్ష సరిగ్గా రాస్తామో లేదో అన్న ఆలోచనలు దరిచేరకుండా ఉంటూ సానుకూల దృక్పథంతో ఉండాలి.