06 June 2024

విరేచనాలైతే.. ఏం తినాలి

Narender.Vaitla

సహజంగానే విరేచననాలైతే కడుపు ఇబ్బందిగా మారుతుంది. కాబట్టి ఈ సమయంలో జీర్ణక్రియకు తోడ్పడే అరటి పండును తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జీర్ణక్రియ మెరుగవుతుంది.

ఇక ఈ సమస్య నుంచి బయటపడాలంటే యాపిల్‌ను ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. యాపిల్స్‌లో ఉండే ఫైబర్‌ కంటెంట్‌ కడుపు ఆరోగ్యాన్ని రక్షిస్తుంది. 

విరేచనాలు ఇబ్బంది పెడుతుంటే ఆహారంలో మసాలాలు, పులుపు తక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. వీటివల్ల జీర్ణక్రియ సాఫీగా సాగుతుంది.

ఘన పదార్థాల కంటే ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. ముఖ్యంగా నీటిని ఎక్కువగా తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో జీర్ణక్రియపై పెద్దగా ప్రభావం పడదు. 

విరేచనాలతో ఇబ్బంది పడుతున్న సమయంలో కొబ్బరి నీరు తాగడం మంచిది. ఇందులోని పొటాషియం, సోడియం వంటి ఎలక్ట్రోలైట్స్ బాడీలో ఎలక్ట్రోలైట్స్ ను బ్యాలెన్స్ చేస్తాయి.

విరేచనాలు అయిన సమయంలో జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి పుల్లటి మజ్జిగను తీసుకోవాలి. దీనివల్ల త్వరగా విరేచనాల సమస్య నుంచి బయటపడొచ్చు.

విరేచనాలు వేధిస్తున్న సమయంలో మాంసాహారానికి దూరంగా ఉండాలి. మాంసాహారం జీర్ణం కావడానికి ఎక్కువ సమయం పడుతుంది కాబట్టి లైట్ ఫుడ్‌ను తీసుకోవడం మంచిది.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం