18 June 2024

వానా కాలం వీటితో ఆరోగ్యం పదిలం.. 

Narender.Vaitla

వర్షాకాలం ఆహారంలో ఉల్లిపాయలు, వెల్లుల్లిని కచ్చితంగా భాగం చేసుకోవాలి. వీటిలోని గుణాలు బాక్టీరియా, వైర‌స్‌ల‌తో పోరాడి, శరీర రోగ నిరోధ‌క శ‌క్తి  పెరగడంలో ఉపయోగపడుతుంది.

తేనెలోని యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు శరీరంలో రోగ నిరోధక శక్తిని పెండచంలో ఉపయోగపడుతుంది. ఇన్ఫెక్షన్లను తగ్గించడంతో అనారోగ్యాల బారిన పడకుండా ఉండొచ్చు.

వర్షాకాలం జలుబు అవుతుందని కొందరు పెరుగుకు దూరంగా ఉంటారు. అయితే పెరుగులోని యాంటీ బాక్టీరియ‌ల్‌, యాంటీ వైర‌ల్ గుణాలు అనారోగ్యాల బారిన పడకుండా కాపాడుతాయి.

 నారింజ‌, కివీలు, ద్రాక్ష, పైనాపిల్, ఉసిరి, స్ట్రాబెర్ సిట్రస్‌ జాతి పండ్లను కచ్చితంగా వర్షాకాలం తీసుకోవాలి. ఇందులోని విటమిన్‌ సి బాక్టీరియా, వైర‌స్‌ల‌కు వ్య‌తిరేకంగా పోరాడుతాయి. 

వర్షాకాలం కచ్చితంగా బాదం పప్పును ఆహారంలో భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. మరీ ముఖ్యంగా రాత్రంతా నానబెట్టి తీసుకుంటే మరింత ఉపయోగం ఉంటుంది.

ఇక వర్షాకాలంలో వీలైనంత వరకు సీ ఫుడ్‌కు దూరంగా ఉండడమే బెటర్. వర్షాకాలంలో నీరు కలుషితమయ్యే అవకాశం ఉంటుంది. దీంతో చేపలు, రొయ్యలు వంటివి తీసుకుంటే ఆరోగ్య సమస్యలు వస్తాయి.

వర్షాకాలంలో జీర్ణ సంబంధిత సమస్యలు వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు లైట్‌ ఫుడ్‌ను, ఫైబర్‌ కంటెంట్ ఎక్కువగా ఉండే ఫుడ్‌ను తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.