అందుబాటులోకి ఆండ్రాయిడ్ 15.. ఈ ఫోన్‌లలో సరికొత్త అప్‌డేట్

TV9 Telugu

10 March 2024

చాలామందికి టీ, కాఫీ తాగే అలవాటు ఉంటుంది. ఇవే తాగడం వల్ల ఒత్తిడి నుంచి చాల రిలీఫ్ గా ఫీల్ అవుతారు కొందమంది.

పొద్దునే గ్లాసెడు కాఫీ తాగనిదే ఏమీ తోచదు మనవాళ్లకు. అంతలా మన జీవితంలో భాగమైన కాఫీకి ప్రపంచంలో రెండో ర్యాంక్‌ దక్కింది.

కాఫీలో ఎన్నో రకాలున్నప్పటికీ భారతీయులు ఇష్టంగా తాగేది మాత్రం ఫిల్టర్‌ కాఫీనే. ఫుడ్‌ అండ్‌ ట్రావెల్‌ గైడ్‌ ప్లాట్‌ఫాం టేస్ట్‌ అట్లాస్‌ తాజాగా జాబితా విడుదల చేసింది

విడుదల చేసిన జాబితాలో ప్రపంచ టాప్‌ 38 కాఫీల జాబితాలో మన ఫిల్టర్‌ కాఫీ రెండో స్థానాన్ని కైవసం చేసుకుంది.

మొదటి ప్లేస్‌లో క్యూబాకు చెందిన ఎస్‌ప్రెస్సో నిలిచింది. ఇండియాలో మరీ ముఖ్యంగా సౌతిండియాలో ఫిల్టర్‌ కాఫీకి ఉన్న డిమాండే వేరు.

మూడు, నాలుగు స్థానాల్లో గ్రీస్‌కు చెందిన రెండు రకాల కాఫీలు నిలువగా.. ఇటలీకి చెందిన క్యాపుచినో ఐదో స్థానం ఆక్రమించింది.

టర్కీ దేశానికి చెందిన టర్కిష్‌ కాఫీ ఆరవ స్థానంలో, ఇటలీకే చెందిన కాఫీ రిస్ట్రెట్టో 7వ స్థానంలో నిలిచాయి.

గ్రీస్‌కు చెందిన ఇంకో రకం ఫ్రాప్పె 8వ స్థానంలో, జర్మనీకి చెందిన ఐస్కాపీ 9వ స్థానంలో నిలిచాయి. పదో స్థానంలో వియత్నామీస్‌ ఐస్డ్‌ కాఫీ నిలిచింది.