అంజీర్ పండ్లు ఆరోగ్యానికి మంచివేగానీ.. వీరికి మాత్రం విషంతో సమానం
28 July 2024
TV9 Telugu
TV9 Telugu
బలహీనంగా ఉన్నవారు అంజీర్ తింటే మంచిదని వైద్యులు చెబుతుంటారు. అంజీర్‌లో పీచు, ఎ, బి, సి, ఇ, కె విటమిన్లు, సోడియం, పొటాషియం, మెగ్నీషియం, మాంగనీస్, కాల్షియం, జింక్, ఫొలేట్, రిబోఫ్లేవిన్, భాస్వరం వంటి పోషకాలు ఎక్కువ
TV9 Telugu
అందుకే అత్తిఅంజీర్ ఆరోగ్యానికి చాలా మేలు చేస్తుంది. ఉదయాన్నే ఖాళీ కడుపుతో డ్రై ఫిగ్స్ తినడం వల్ల అనేక పొట్ట సమస్యలు తగ్గుతాయి
TV9 Telugu
రక్తహీనత సమస్యకు అంజీర్ చాలా ప్రభావవంతంగా పనిచేస్తుంది. ఎండిన అంజీర్ పండ్లను తినడం వల్ల కూడా ఎన్నో ప్రయోజనాలు పొందవచ్చు
TV9 Telugu
అంజీర్ పండ్లు పోషకాల సంపద అయినప్పటికీ, అవి అందరికీ ఉపయోగపడవు. కొన్ని సందర్భాల్లో వీటివల్ల ప్రయోజనాల కంటే సమస్యలను ఎక్కువగా కలిగిస్తుంది
TV9 Telugu
ముఖ్యంగా మైగ్రేన్ సమస్య ఉంటే ఎండిన ఫిగ్ పండ్లను తినవద్దు. దీన్ని తినడం వల్ల శరీరంలో సల్ఫైట్ పరిమాణం పెరుగుతుంది. ఫలితంగా మైగ్రేన్ సమస్య మరింత పెరగవచ్చు
TV9 Telugu
అంజీర్ పండ్లలో చక్కెర ఉంటుంది. ఫలితంగా అంజీర పండ్లను తినడం వల్ల మధుమేహం సమస్య పెరుగుతుంది. కాబట్టి మధుమేహ వ్యాధిగ్రస్తులు అంజీర్ పండ్లకు దూరంగా ఉండాలి
TV9 Telugu
అలాగే అలెర్జీ సమస్యలు, కిడ్నీ లేదా పిత్తాశయంలో రాళ్లు, కాలేయ సమస్యలు ఉంటే అంజీర్ పండ్లను ఎట్టిపరిస్థితుల్లోనూ తినవద్దు
TV9 Telugu
అంజీర్ పండ్లను తినడం వల్ల కొన్నిసార్లు కడుపునొప్పి, అపానవాయువు, వికారం, ఊపిరి ఆడకపోవటం వంటి సమస్యలు కూడా వస్తాయి. అలాగే చర్మంపై దద్దుర్లు, మొటిమల సమస్యలు వచ్చినా అంజీర పండ్లను తినకండి