మెంతితో మేలు ఇంతింత కాదయా.. రోజూ కాస్తింత తిన్నా చాలు!
March 02, 2024
TV9 Telugu
మెంతి గింజల గురించి తెలియని వారుండరు. కూరల్లో వాడే ఈ మెంతులు ఆరోగ్యినికి ఎంత మేలు చేస్తాయో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అలాగే మెంతి ఆకుల్లో కూడ ఎన్నో పోషకాలు ఉంటాయంటున్నారు నిపుణులు
ముఖ్యంగా మెంతి ఆకు తీసుకోవడం వల్ల శరీరానికి సరిపడ ఐరన్ అందుతుంది. రక్తహీనత బారీన పడకుండా నివారిస్తుంది. మెంతి ఆకుల్లో కెలొరీలు తక్కువగా ఉంటాయి. కానీ శరీర ద్రవాల్లో కరిగే పీచు పదార్థం మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది
అందువల్ల బరువు తగ్గాలనుకునే వారికి మెంతి కూర మంచి ఎంపిక. తరచూ ఆహారంలో మెంతికూర తీసుకోవడం వల్ల కడుపు నిండుగా ఉండటమే కాకుండా, గుండెల్లో మంట వంటి లక్షణాలను తగ్గిస్తుంది
మెంతి ఆకుల్లో విటమిన్ సి, ఎ లతోపాటు బీటా కెరొటిన్ సమృద్ధిగా ఉంటుంది. ఇందులోని విటమిన్-సి రోగనిరోధకతను పెంచుతుంది
విటమిన్ ఎ దృష్టి సమస్యలను దూరం చేస్తుంది. ఈ ఆకుల్లోని యాంటీఆక్సిడెంట్ సమ్మేళనాలు చర్మాన్ని మెరిసేలా చేసి, మరింత యవ్వనంగా మారుస్తాయి
ఇందులో ఉండే యాంటాసిడ్‌లు జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతాయి. వీటితో కూరలే కాకుండా స్మూతీలు వంటివీ కూడా చేసుకుని ఆస్వాధించవచ్చు
ఇందులోని పోషకాలు చెడుకొవ్వులతో పోరాడి మధుమేహాన్ని అదుపులో ఉంచుతాయి. శరీరంలోని టాలరెన్స్‌ని పెంచడం ద్వారా ఇన్సులిన్ పనితీరు మెరుగుపరుస్తుంది
బాలింతల్లో పాల ఉత్పత్తిని ప్రేరేపించే గుణాలు మెంతి కూరలో సమృద్ధిగా ఉంటాయి. అందుకే ప్రసవానంతరం బిడ్డకు సరిపడ పాలు పడనప్పుడు తల్లి రోజూ కప్పు మెంతికూరను పుష్టిగా పాలు పడతాయి