ప్రస్తుత కాలంలో మారుతున్న ఆహారపు అలవాట్లు, మారుతున్న జీవనశైలి వల్ల శరీరంలో అనేక మార్పులు చోటు చేసుకుంటున్నాయి.
వాటిలో ముఖ్యంతో వయసుతో సంబంధం లేకుండా వచ్చే స్థూలకాయం ఒకటి. ఊబకాయాన్ని తగ్గించుకోవడానికి మంచి ఆహారం, వ్యాయామమే మార్గం.
అంతేకాకుండా కొన్ని ఇంటి చిట్కాలను పాటించడం వల్ల బరువు తగ్గొచ్చని మన పెద్దలు చెబుతున్నారు. బరువు తగ్గడానికి, ఉదయాన్నే ఖాళీ కడుపుతో ఈ నీటిని తాగితే.. గుట్ట కూడా కరగాల్సిందేనని వైద్యులు అంటున్నారు.
6-8 సోంపు గింజలను ఒక కప్పు నీటిలో ఐదు నిమిషాలు మరిగించాలి. దీన్ని వడపోసి ఉదయం ఖాళీ కడుపుతో వేడి వేడిగా తాగాలి. ఇది అధిక ఆకలి సమస్య నుండి ఉపశమనం కలిగిస్తుంది.
అంతేకాకుండా తినాలనే కోరికను తగ్గిస్తుంది. ఇది శరీరంలోని మురికిని శుభ్రపరుస్తుంది. మూత్రవిసర్జన, చెమట అధికంగా వచ్చేలా ప్రేరేపిస్తుంది.
ఉసిరి రసంలో విటమిన్ సి పుష్కలంగా లభిస్తుంది. ఇది అద్భుతమైన యాంటీ ఆక్సిడెంట్. ఇది శరీరం నుండి విష పదార్థాలను తొలగించడంలో సహాయపడుతుంది.
ఇది జీవక్రియను పెంచడంలో, కేలరీలను బర్న్ చేయడంలో సహాయపడుతుంది. ఇది శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది.