ఫ్యాటీ లివర్ సమస్యా? తినే ఆహారంలో వీటిని చేర్చుకోండి
16 July 2024
TV9 Telugu
Pic credit - pexels
యువతలో ఫ్యాటీ లివర్ చాలా సాధారణం. ఎవరైనా ఫ్యాటీ లివర్ సమస్యతో ఇబ్బంది పడుతుంటే.. తప్పనిసరిగా తినే ఆహారంలో ఈ 7 రకాల ఆహారాన్ని చేర్చుకోవాలి.
ఉదా రంగు క్యాబేజీని తినే ఆహారంలో చేర్చుకోండి. ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, పీచుపదార్థాలు కాలేయం వాపును తగ్గిస్తాయి. కాలేయం నుంచి విషాన్ని తొలగిస్తాయి.
బ్లూబెర్రీస్, స్ట్రాబెర్రీలు వంటి బెర్రీలు యాంటీఆక్సిడెంట్లు, ఫైబర్ తో నిండి ఉన్నాయి. ఈ పండ్లు కాలేయ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి.
సముద్ర చేపలలో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి. ఈ పోషకం కాలేయ మంటను తగ్గిస్తుంది. కాలేయ పనితీరును మెరుగుపరుస్తుంది.
బాదం, వాల్‌నట్‌లు, చియా సీడ్స్, అవిసె గింజల్లో ఆరోగ్యకరమైన కొవ్వులు, ప్రోటీన్లు , ఫైబర్‌లు అధికంగా ఉంటాయి. ఇవి ఫ్యాటీ లివర్ సమస్యల నివారణకు ప్రయోజనకరంగా ఉంటాయి.
ఫ్యాటీ లివర్ ఉన్నట్లు గుర్తించినట్లయితే వంట నూనెను కూడా మార్చుకోండి. రెగ్యులర్ వంట నూనెకు బదులుగా ఆలివ్ నూనెని చేర్చుకోండి. ఇది కాలేయానికి మేలు చేస్తుంది.
రోజుకు 3-4 కప్పుల గ్రీన్ టీ తీసుకోండి. ఈ టీలోని యాంటీఆక్సిడెంట్లు కాలేయ మంటను తగ్గించి, కాలేయ నిర్విషీకరణలో సహాయపడతాయి.
రోజూ తినే ఆహారంలో పసుపుని ఉపయోగించండి. పసుపులో ఉండే కర్కుమిన్ సమ్మేళనం కాలేయ సమస్యలను తగ్గించడంలో బాగా ఉపయోగపడుతుంది.