15 June 2024

కష్టం వచ్చిన ప్రతీసారి..  గుర్తొచ్చేది నాన్నే. 

Narender.Vaitla

ఓర్పుకు మారు పేరు, నీతికి నిదర్శనం, భవిష్యత్తుకు మార్గదర్శకులు.. మన ప్రగతి సోపానం నాన్న. హ్యాపీ ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు.

నాన్నంటే మరచిపోలేని జ్ఞాపకం.. అండగా నిలిచే ధైర్యం. తోడుగా స్నేహం. బిడ్డల భవిష్యత్తుకు కోసం తన ఇష్టాలను త్యాగం చేసే నాన్నలకు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు. 

ఓడినప్పుడు ప్రపంచమంతా నీకు వ్యతిరేకంగా ఉన్నా నేనున్నా అంటూ ధైర్యం చెప్పే ఒకే వ్యక్తి నాన్న మాత్రేమ. ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు.

కష్టం వచ్చిన ప్రతీసారి గుర్తొచ్చే తొలి వ్యక్తి నాన్నే. నాకు అనునిత్యం తొడుగా నిలిచే నాన్నకు ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు.

తప్పటడుగులు వేయకుండా, ఎప్పటికీ తడబడకుండా మనం ఎన్నటికీ తూలి పడకుండా, వెన్నంటే నిలిచే ధైర్యంగా ఉండేవాడు నాన్న. ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు.

నావికుడు, నిత్య శ్రామికుడు, వెన్నంటే నిలిచే స్నేహితుడు, కష్టంలో తోడుగా ఉండే సన్నిహితుడు మన కలల వారధి మనల్ని నడిపే సారధి నాన్న. ఫాదర్స్‌ డే శుభాకాంక్షలు. 

గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకొనిచ ఓడి నప్పుడు.. గెలుస్తావులే అంటూ భుజాలపై తట్టి గెలుస్తావులే అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్న ఒక్కడే. హ్యాపీ ఫాదర్స్‌ డే.

మనలో జీవాన్ని నింపేది నాన్న.. మనలోని లోపాలను సరిచేసేది నాన్న.. మన భవిష్యత్తుకు పునాదులు వేసేది నాన్న.. మనకు గమ్యం చూపేది నాన్న. హ్యాపీ ఫాదర్స్ డే.