10 June 2024

గుడ్డు తింటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందా.? 

Narender.Vaitla

రొయ్యలు తీసుకుంటే కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని మనలో చాలా మంది అపోహలో ఉంటారు. అయితే ఇందులో నిజం లేదని నిపుణులు చెబుతున్నారు. రొయ్యల్లో కొలెస్ట్రాల్‌ ఉన్నా.. సంతృప్తి కొవ్వు తక్కువగా ఉంటుందని. ఇది గుండెకు మంచిదని చెబుతున్నారు.

గుడ్డు తింటే కొలెస్ట్రాల్ పెరుగుతుందని నమ్ముతారు. అఇయతే ఇది కూడా అపోహ మాత్రమే. నిజానికి గుడ్ల కొలెస్ట్రాల్ స్థాయిలకు సంబంధించి ముఖ్యంగా ఇవి HDL (మంచి) కొలెస్ట్రాల్‌ను మెరుగుపరుస్తాయి.

రెడ్‌ మీట్ కారణంగా కొలెస్ట్రాల్‌ పెరుగుతుందనడంలో నిజం ఉన్నా.. ఇందులో ఐరన్, విటమిన్ బి12 వంటి పోషకాలు ఉంటాయి. కాబట్టి మితంగా తీసుకుంటే ప్రమాదం ఉండదు.

చీజ్‌ తీసుకున్నా కొలెస్ట్రాల్‌ పెరుగుతుందని అనుకుంటారు. అయితే కొన్ని రకాల చీజ్‌లో సంతృప్త కొవ్వు ఎక్కువగా ఉన్నప్పటికీ, వాటిని మితంగా తినవచ్చు.

అవాకాడలో కొవ్వు అధికంగా ఉంటుందని వాటికి దూరంగా ఉండాలని అనుకుంటారు. అయితే వీటిలో కొవ్వు అధికంగా ఉన్నా.. ఇది ఎక్కువగా గుండె-ఆరోగ్యకరమైన మోనోశాచురేటెడ్ కొవ్వు అని నిపుణులు చెబుతున్నారు.

ఆరోగ్యకరమైన కొలెస్ట్రాల్ పెరగాలంటే తీసుకునే ఆహారంలో ఓట్స్‌ను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇవి శరీరానికి అవసరమయ్యే మంచి కొవ్వులను అందిస్తాయి.

ఇక వాల్నట్, బాదంతో పాటు డార్క్‌ చాక్లెట్ వంటివి అలవాటు చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటి ద్వారా కూడా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి.

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.