టీ, కాఫీ తాగేటప్పుడు మీరూ నాలుక కాల్చుకుంటున్నారా? 

15 July 2024

TV9 Telugu

TV9 Telugu

వేడి పదార్థాలు తిన్నా, తాగినా చాలా మందికి కాలుక కాలుతుంది. వేడి ప్రభావంతో నాలుక మండిపోతుంది. ఇలాంటి సమయంలో నాలుకపై విపరీతమైన మంట కారణంగా మరేదైనా తినాలంటే కూడా జంకుతుంటారు

TV9 Telugu

టీ లేదా కాఫీ సిప్ చేస్తున్నప్పుడు ఒక్కోసారి అనుకోకుండా నాలుక కాలడం సర్వసాధారణం. నాలుక కాలితే ఏ ఆహారాన్నీ రుచి చూడలేము. రోజంతా విచిత్రమైన అసౌకర్యంతో గడపాల్సి వస్తుంది

TV9 Telugu

మీకెప్పుడైనా కాఫీ తాగేటప్పుడు ఇలా నాలుక కాలిందా? అయితే ఈ సమస్య నుంచి వెంటనే ఉపశమనం పొందడానికి ఈ కింది చిట్కాలు ఫాలో అయిపోండి

TV9 Telugu

మండుతున్న నాలుకను గోరువెచ్చని ఉప్పు నీటిలో శుభ్రం చేసుకోవాలి. గ్లాసుడు గోరువెచ్చని నీటిలో చిటికెడు ఉప్పు కలిపి, మౌత్‌వాష్‌ను చేసుకుంటే తక్షణ ఉపశమనం కలుగుతుంది

TV9 Telugu

ఉప్పు యాంటీ సెప్టిక్‌గా పనిచేస్తుంది. ఎక్కువగా కాలితే నొప్పి వాపు సంభవించదు. ఉప్పునీరు గాయాలను నయం చేయడానికి భలేగా సహాయపడుతుంది

TV9 Telugu

పలు రకాల కాలిన గాయాలు నయం చేయడంలో కలబందకు మించిన ప్రత్యామ్నాయం లేదు. అలోవెరా జెల్ దెబ్బతిన్న కణాలను రిపేర్ చేస్తుంది, నొప్పిని తగ్గిస్తుంది

TV9 Telugu

చక్కెర తేలికపాటి నొప్పి నివారిణిగా పనిచేస్తుంది. కాబట్టి నాలుక కాలిన భాగంలో చక్కెర వేసి, కాసేసు అలాగే ఉంచితే నొప్పి, మంట నుంచి ఉపశమనం పొందవచ్చు

TV9 Telugu

పసుపులో యాంటీ ఇన్‌ఫ్లమేటరీ గుణాలు ఉంటాయి. ఇది గాయాలను నయం చేయడంలో సహాయపడుతుంది. నాలుక ఎక్కువగా కాలిపోతే పసుపు పాలు తాగినా చికాకు తగ్గుతుంది