40 ఏళ్లు దాటాక ఈ మార్పులు తప్పనిసరి.. 

Narender Vaitla

24 Aug 2024

40 ఏళ్ల తర్వాత తీసుకునే ఆహారంలో కచ్చితంగా ఆకుకూరలను భాగం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వీటిలో ఉండే ఐరన్, విటమిన్లు, కాల్షియం, ప్రొటీన్స్ ఆరోగ్యానికి మేలు చేస్తాయి.

ఇక కచ్చితంగా తీసుకోవాల్సిన మరో ఆహారం గుడ్లు. తీసుకునే ఆహారంలో ఉడికించిన గుడ్లను భాగం చేసుకోవడం వల్ల కండరాలు శక్తిని కోల్పోకుండా శరీరం బలంగా మారుతుంది.

ఆరోగ్యంగా ఉండాలంటే పప్పులను ఆహారంలో భాగం చేసుకోవాలి. ముఖ్యంగా పప్పులు. పెసరపప్పు, మినప, శనగ పప్పులను డైట్‌లో ఉండేలా చూసుకోవాలని సూచిస్తున్నారు.

యాంటీ ఆక్సిడెంట్స్‌ ఎక్కువగా ఉండే ఆహారాలను భాగం చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. శరీరాన్ని చురుగ్గా ఉంచడంలో యాంటీ ఆక్సిడెంట్స్‌ కీలక పాత్ర పోషిస్తాయి. 

సాధారణంగా వయసు పెరుగుతున్నా కొద్దీ.. జీర్ణక్రియపై ప్రభావం పడుతుందని తెలిసిందే. అందుకే తీసుకునే ఆహారంలో పెరుగు, మజ్జిగ వంటి పాల ఉత్పత్తులు ఉండేలా చూసుకోవాలి. 

అదే విధంగా 40 ఏళ్లు దాటిన తర్వాత తీసుకున ఆహారంలో ఫైబర్ కంటెంట్ ఎక్కువగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనివల్ల జీర్ణ సంబంధిత సమస్యలు రావు.

వయసు మళ్లిన వారిలో వచ్చే సమస్యలకు చెక్‌ పెట్టడంలో బెర్రీలు కీలక పాత్ర పోషిస్తాయని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా మహిళల్లో వచ్చే రొమ్ము క్యాన్సర్‌కు చెక్‌ పెట్టొచ్చు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.