చాలా మంది అన్నం తినకుండా ఒక రోజు కూడా గడపలేరు. కానీ, మీరు ఒక నెల అన్నం తినకపోతే, అది మీ శరీరంపై ఎలాంటి ప్రభావం చూపుతుంది? దీని గురించి తెలుసుకుందాం.
TV9 Telugu
చాలా మంది అన్నం తినకుండా ఒక్క పూట కూడా ఉండలేరు. కానీ వైట్ రైస్ లో కార్బోహైడ్రేట్లు ఎక్కువగా ఉంటాయి. బరువు పెరుగుతామని కొందరు అన్నం తినడం తగ్గించారు.
TV9 Telugu
వైట్‌రైస్‌లో గ్లైసెమిక్ ఇండెక్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. తింటే మీ రక్తంలో చక్కెర స్థాయిలు ఫాస్ట్ గా పెరుగుతాయి. అందుకే డయాబెటీస్‌లో దీన్ని తినకూడదని నిపుణులు చెబుతున్నారు.
TV9 Telugu
వైట్ రైస్ లో ఫైబర్ ఉండదు. కాబట్టి మలబద్దకం వంటి జీర్ణ సమస్యలు ఎక్కువ అవుతాయి. కానీ ఇతర ధాన్యాల్లో ఉండే ఫైబర్ కంటెంట్ మీ జీర్ణవ్యవస్థను ఆరోగ్యంగా ఉంచుతుంది.
TV9 Telugu
వైట్ రైస్ లో ఎక్కువ మొత్తంలో స్టార్చ్ ఉంటుంది. ఇది శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను బాగా పెంచుతుంది.ఇది గుండెకు ప్రమాదం. కాబట్టి వైట్‌రైస్ మానేస్తే హార్ట్ హెల్తీగా ఉంటుంది.
TV9 Telugu
వైట్ రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు చాలా ఫాస్ట్ గా పెరుగుతాయి. ఆ తర్వాత అది వేగంగా పడిపోతుంది. దీంతో బద్దకం, అలసట వంటి సమస్యలు వస్తాయి.
TV9 Telugu
అయితే, అన్నాన్ని పూర్తిగా మానేయడం మంచిది కాదు. కానీ బ్రౌన్ రైస్, బార్లీ, చిరుధాన్యాలు, ఓట్స్ వంటి ఇతర ధాన్యాలతో భర్తీ చేయొచ్చు. ఇవి మిమ్మల్ని హెల్తీగా ఉంచుతాయి.
TV9 Telugu
ఇతర ఆహార పదార్థాలతో పాటుగా వైట్ రైస్ లో ఉండే పోషకాల లోపాలను కూడా పూర్తి చేయాలి. ప్రతి వ్యక్తి పోషక అవసరాలు భిన్నంగా ఉంటాయి. కాబట్టి వైద్యుల సలహా తప్పనిసరి.