చలికాలంలో ప్రతి రోజు ఒక స్పూను నువ్వులు తింటే చాలు..!

Jyothi Gadda

06 November 2024

TV9 Telugu

నువ్వులను డైట్లో చేర్చుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి. ముఖ్యంగా శీతాకాలంలో భారతీయులు నువ్వుల గింజలను ప్రత్యేకంగా ఆహారంలో చేర్చుకుంటారు.   

TV9 Telugu

నువ్వుల్లోని వేడి స్వభావం కారణంగా శరీరాన్ని లోపలి నుంచి వెచ్చగా ఉంచుతాయి. వీటిలో ప్రొటీన్, ఫైబర్, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, ఫాస్పరస్, విటమిన్ బి పుష్కలంగా ఉంటుంది. 

TV9 Telugu

నువ్వుల్లో ఉండే  యాంటీఆక్సిడెంట్లు ఇవి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి. కొలెస్ట్రాల్ లెవల్స్ ను కంట్రోల్ చేయడంలో సహాయపడతాయి. గుండె సమస్యలను తగ్గిస్తాయి. 

TV9 Telugu

 నువ్వులు బ్లడ్ షుగర్ పేషంట్లకు మేలు చేస్తాయి. ఇందులో ఉండే ప్రొటీన్, ఫైబర్ బ్లడ్ లో షుగర్ లెవల్స్ ను కంట్రోల్ చేస్తాయి. వీటిని తింటే రక్తంలో గ్లూకోజ్ లెవల్స్ ఒక్కసారిగా పెరగవు. 

TV9 Telugu

నువ్వులలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది.  మలబద్ధకం వంటి సమస్యలను నివారిస్తుంది.నువ్వులలో కాల్షియం, మెగ్నీషియం , జింక్ అధిక మోతాదులో ఉన్నాయి. ఎముకలను బలం

TV9 Telugu

బరువు తగ్గాలనుకునేవారికి నువ్వులు ఎంతో మేలు చేస్తాయి. ఎందుకంటే వీటిలో ఫైబర్, ఆరోగ్యకరమైన కొవ్వులు ఉంటాయి. ఇవి తింటే కడుపు నిండుగా ఉంటుంది. 

TV9 Telugu

నువ్వుల నూనె చర్మానికి, జుట్టుకు మేలు చేస్తుంది. చర్మాన్ని తేమగా, ఆరోగ్యంగా ఉంచడంలో సహాయపడుతుంది. జుట్టును వేగంగా పెరిగేలా చేస్తుంది. చుండ్రు సమస్యకు చెక్ పెడుతుంది.  

TV9 Telugu

నువ్వుల్లో ఎక్కువ మొత్తంలో మెగ్నీషియం ఉంటుంది. డయాబెటిక్ రోగులకు ప్రయోజనకరంగా ఉంటాయి. అంతేకాదు బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది.