రోజూ మరమరాల మిక్చర్ తింటున్నారా? ఈ 4 వ్యాధులకు వెల్కం చెప్పినట్లే

 05 August 2024

TV9 Telugu

Pic credit -Google

మరమరాలను టిఫిన్ గా స్నాక్ ఐటెం గా అనేక విధాలుగా ఆస్వాదించవచ్చు. మరమరలను అలాగే తినవచ్చు లేదా చాట్‌, సాస్‌లతో కలిపి తినవచ్చు.

మరమరాల మిక్చర్ పేరు వింటేనే చాలు నోటిలో నీరు ఊరుతుంది. పిల్లలు, పెద్దలు ఇలా వయసుతో సంబంధం లేకుండా దీనిని తింటారు. 

ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, వేరుశనగ పప్పు ఇలా రకరకల ఐటమ్స్ వేసి రుచికరంగా తయారు చేస్తారు. చిన్న పిల్లలకు టిఫిన్లకు లేదా సాయంత్రం ఆఫీసుకు తిరిగి వచ్చిన తర్వాత తినడానికి మంచి స్నాక్ ఐటెం

కడుపు నిండుతుంది. తక్కువ డబ్బుతో రుచికరమైన ఆహారం . తయారీ కూడా చాలా ఈజీ. కనుక చాలా మందికి రోజూ మరమరాల మిక్చర్  తినడం అలవాటు.

అయితే అతి సర్వత్రా వర్జయేత్ అన్నట్లు ఎక్కువగా తినడం ఏదీ మంచిది కాదు. ప్రతిరోజూ మరమరాల మిక్చర్ ను తినడం వలన శరీరంలో అనేక సమస్యలను కలిగిస్తుంది.

మరమరాల మిక్చర్ లో నూనె, వేరుశనగ పప్పు వంటి వేయించిన పదార్ధాలు ఉన్నాయి. ఇది కొలెస్ట్రాల్ పెరగడానికి కారణం కావచ్చు. గుండె జబ్బులు రావచ్చు.

అంతేకాదు మరమరాల గ్లైసెమిక్ సూచిక కొంచెం ఎక్కువగా ఉంటుంది. దీన్ని రోజూ తింటే షుగర్ పెరుగుతుంది. కేలరీల పరిమాణం పెరుగుతుంది.

రోజూ గ్యాస్, గుండెల్లో మంట, అసిడిటీ సమస్యలతో బాధపడుతుంటే మరమరాల మిక్చర్ తినకపోవడమే మంచిది. ఇది గుండెల్లో మంట సమస్యను పెంచుతుంది.

మరమరాల్లో ఉప్పు ఎక్కువ. వీటిని ఎక్కువగా తినడం వల్ల ఉప్పుతో పాటు సోడియం కూడా పెరుగుతుంది. ఇది రక్తపోటును పెంచుతుంది. ఒత్తిడి పెరిగితే కళ్లు, కిడ్నీలు, గుండెల్లో సమస్యలు తలెత్తుతాయి.