ఈ పచ్చటి కూరగాయ ఔషధాల నిధి.. రోజు ఇలా తినండి చాలు..క్యాన్సర్‌ సైతం ఖతం!

Jyothi Gadda

23 October 2024

శరీరం ఆరోగ్యంగా ఉండడానికి ప్రతి రోజు ఆరోగ్యకరమైన ఆహారాలు మాత్రమే తీసుకోవాలని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇక శీతాకాలంలో తినే ఆహారంపై మరింత శ్రద్ధ అవసరం.

తరచుగా ఆహారాల్లో బ్రోకలీని తీసుకోవడం వల్ల శరీరానికి తగిన పోషకాలు లభిస్తాయి. అంతేకాకుండా అనారోగ్య సమస్యల కారణంగా దెబ్బతిన్న అవయవాలు కూడా మెరుగుపడతాయి. 

ప్రతి రోజు బ్రోకలీని తీసుకోవడం వల్ల బోలెడు లాభాలు కలుగుతాయని ఆరోగ్య నిపుణులు చెబుతున్నారు. ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇప్పుడు మనం తెలుసుకుందాం.

తరచూ బ్రోకలీని తీసుకోవటం వల్ల కొలెస్ట్రాల్‌ తగ్గుతుంది. కొలెస్ట్రాల్‌ వల్లే శరీరంలో కలిగే ఇతర వ్యాధులను కూడా తరిమికొట్టే శక్తి బ్రోకలీకి ఎక్కువగా ఉంటుంది.

క్యాన్సర్‌తో పోరాడే వారు ప్రతి రోజు ఆహారంలో బ్రోకలీ, కాలీఫ్లవర్, బ్రస్సెల్స్ మొలకలు, క్రూసిఫెరస్ కూరగాయలు తీసుకోవడం మంచిది. ఇవి దీర్ఘకాలిక వ్యాధులను దూరం చేస్తుంది.

బ్రోకలీలో ఈస్ట్రోజెన్‌ను తగ్గించే గుణాలు అధిక పరిమాణంలో ఉన్నాయి. క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల రొమ్మ,గర్భాశయ క్యాన్సర్‌ నివారణకు ప్రభావంతంగా సహాయపడుతుంది. 

బ్రోకలీలో అధిక పరిమాణంలో కాల్షియం, విటమిన్ కె  లభిస్తాయి. కాబట్టి బోలు ఎముకల వ్యాధి ఇతర సమస్యలతో బాధపడేవారికి ఈ బ్రోకలీ ప్రభావంతంగా సహాయపడుతుంది. 

అన్ని రకాల ఎముక వ్యాధులు దూరమవుతాయి. ఇందులో కాల్షియంతో పాటు మెగ్నీషియం, జింక్, ఫాస్పరస్ వంటి పోషకాలు నిండివున్నాయి. ఎముఖ దృఢంగా, బలంగా తయారవుతాయి.