రాత్రిపూట అంజీర్ తింటే ఆ సమస్యకు చెక్‌ పెట్టొచ్చు..

29 December 2023

TV9 Telugu

శీతాకాలం వచ్చిందంటే వ‌ణికించే చ‌లి గాలులు, హీట‌ర్లు, మందపాటి బ్లాంకెట్‌లు, పొగ‌లు క‌క్కే ఆహారం గుర్తుకొస్తాయి. రోజువారీ అలవాట్లు కూడా మారిపోతుంటాయి

చ‌లికాలంలో దొరికే పండ్లు, కూర‌గాయ‌లు, డ్రైఫ్రూట్స్‌తో పాటు వింట‌ర్ డైట్‌లో అంజీర్‌ను కూడా చేర్చుకోవాల‌ని పోష‌కాహార నిపుణులు సూచిస్తున్నారు.

అంజీర్‌లో ఐర‌న్‌, క్యాల్షియం, మెగ్నీషియం, పొటాషియం వంటి పోష‌కాలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి

అంజీర్ పండ్లను అత్తిపండ్లు (ఫిగ్స్) అని కూడా అంటారు. డైఫ్రూట్స్ రూపంలోనూ లభించే అంజీర్ మార్కెట్లో విరివిగా లభిస్తుంటాయి.

తినడానికి రుచిగా ఉండడమే కాదు.. అద్భుతమైన పోషకాలు కూడా వీటిలో ఉన్నాయి. అంజీర్‌లో ఉండే స‌హ‌జ‌మైన వేడిమి శీతాకాలంలో శ‌రీరానికి వెచ్చద‌నం అందిస్తుంది.

అంజీర్‌లో విటమిన్-ఎ, సి, కె వల్ల అధిక రక్తపోటు, అధిక చక్కెర కంట్రోల్ అవుతుంది. ఆయుర్వేదంలో అంజీర్ పండ్లకు ప్రత్యేకమైన స్థానముంది

ఇందులో ఉండే పోష‌కాలు రోగ‌నిరోధ‌క వ్యవ‌స్ధను ప్రేరేపించి సీజ‌న‌ల్ అస్వస్ధత‌ల‌ను నివారిస్తాయి. శ‌రీర ఉష్ణోగ్రను నియంత్రించడంతోపాటు ఎముక‌లను బ‌లోపేతం చేస్తాయి

అంజీర్ పండ్లు శ‌రీరంలోని కొలెస్ట్రాల్ స్థాయిల‌ను త‌గ్గించి మంచి కొలెస్ట్రాల్ పెంచుతుంది. తద్వరా గుండె సమస్యలు అదుపులో ఉంటాయి

వీటిలో ఉండే ఫైబ‌ర్ మ‌ల‌బ‌ద్ధకాన్ని నివారించి ప్రేవుల ఆరోగ్యాన్ని మెరుగుప‌రుస్తుంది. రోజూ ఉద‌యాన్నే అంజీర్ తీసుకోవ‌డం ద్వారా మ‌ల‌బద్ధకాన్ని నివారించవచ్చు