నల్లని ఒత్తైన కురులు మీ సొంతం కావాలంటే ఈ ఆహారాలు తినాల్సిందే

April 29, 2024

TV9 Telugu

ఫంక్షన్‌.. పండగ.. సందర్భం ఏదైనా వేడుకలో అందరికన్నా అందంగా మెరిసిపోవాలని ప్రతి మగువ అనుకుంటుంది. ఇలాంటప్పుడు ముఖానికి మాత్రమే కాదు జుట్టుకీ అవసరమైన సంరక్షణ అవసరం

ముఖ్యంగా మనం తీసుకునే ఆహారం జుట్టు, చర్మం పైన కూడా ఎంతో ప్రభావం చూపుతుంది. చర్మం తాజాగా, కాంతివంతంగా మెరిసిపోవాలన్నా.. జుట్టు కుదుళ్లు బలంగా మారాలన్నా పోషకాలున్న పదార్థాలను ఆహారంలో చేర్చుకోవాలి

గుడ్లు, పెరుగులో మాంసకృత్తులు, విటమిన్‌ బి5 పుష్కలంగా ఉంటాయనే సంగతి తెలిసిందే. వీటిని తీసుకోవడం వల్ల ఈ పోషకాలన్నీ అంది మాడుకు రక్తప్రసరణ బాగా జరిగి జుట్టు పెరుగుతుంది

సాల్మన్‌ చేపల్లో ఒమేగా-3 ఫ్యాటీ ఆమ్లాలు అధికంగా ఉంటాయి. ఇవి జుట్టును ఆరోగ్యంగా మార్చి మెరిసేలా చేస్తాయి. ఒమేగా 3 ఫ్యాటీ ఆమ్లాలు జుట్టు పొడిబారకుండా కాపడుతాయి

దాల్చిన చెక్క రక్తప్రసరణను మెరుగుపరుస్తుంది. జుట్టు కుదుళ్లకు పోషణను చేకూర్చి ఆరోగ్యంగా పెరగడానికి ఉపయోగపడుతుంది. కాబట్టి దాల్చిన చెక్క పొడిని ఆహారంలో తప్పక ర్చుకోవాలి

జుట్టుకి నిగారింపు రావాలన్నా, ఆరోగ్యంగా కనిపించాలన్నా  పప్పు దినుసులు తప్పక తినాలి. వాటిల్లో మాంసకృత్తులు, ఇనుము జుట్టుకు ఎంతో మేలు చేస్తాయి

చిలగడ దుంపలో విటమిన్‌ ఎ అధికంగా ఉంటుంది. ఇది మాడుపై తైలగ్రంథుల పనితీరును మెరుగుపరిచి, జుట్టు కాంతివంతంగా కనిపించేలా చేస్తుంది. జుట్టు రాలడం, పలుచబడడం వంటి సమస్యలు తగ్గుముఖం పడతాయి

పోషకాల గని బాదంలో పీచు, మాంసకృత్తులతో పాటు మాంగనీస్‌, సెలీనియం.. వంటి పోషకాలు పుష్కలంగా ఉంటాయి. ఇవి జుట్టును మెరిపించడంతో పాటు కుదుళ్లకు బలాన్ని ఇస్తాయి