నిమ్మచెక్క మ్యాజిక్‌.. బట్టలపై మొండి మరకలు ఇట్టే మాయం..

April 10, 2024

TV9 Telugu

నిమ్మలో ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు ఎన్నో ఉంటాయనే సంగతి అందరికీ తెలిసిందే. అయితే నిమ్మతో మరి దీన్ని మరికొన్ని ఇంటి పనులు సులువుగా అయ్యేందుకూ వాడొచ్చు

దుప్పట్లు ఉతికేటప్పుడు నీళ్లలో ఒక నిమ్మచెక్క, అర చెంచా వంటసోడా వేసి నానబెట్టి ఉతికితే తెల్లగా మెరుస్తాయి. మరకలు ఉన్న చోట నిమ్మ చెక్కతో రుద్దినా చక్కగా పోతాయి

అరటి, వంకాయ, బీట్‌రూట్‌ వంటి కూరగాయలు కోసినప్పుడు చేతులు నల్లగా మారతాయి. అప్పుడు నిమ్మచెక్కతో రుద్దితే చేతులకు మునుపటి రంగు వస్తుంది

అలాగే నెయిల్ పెయింట్ మరకలు తొలగించడానికి మ్మరసంలో కొద్దిగా బేకింగ్ సోడా మిక్స్ చేసి ఈ మిశ్రమాన్ని మరకలు ఉన్నచోట అప్లై చేయాలి

10 నిమిషాల పాటు అలాగే ఉంచి ఆ తర్వాత ఉతికేతస్తే బట్టల నుంచి నెయిల్ పెయింట్ మరకలు అదృశ్యమవుతుంది. జిడ్డు కూడా త్వరగా వదులుతుంది

ఇంట్లో చీమలు ఎక్కువగా ఉంటే.. వాటి దగ్గర కాస్త నిమ్మరసాన్ని చల్లితే సరి.. వెంటనే పారిపోతాయి. అలాగే నిమ్మ, డిటర్జెంట్ మిశ్రమం తుప్పు మరకలను కూడా సులువుగా తొలగిస్తుంది

ఫ్రిజ్‌లో ఎక్కువ ఆహారపదార్థాలు సర్దినప్పుడు వాటి తాలూకు వాసనలు ఇబ్బందిపెడతాయి. ఇలాంటప్పుడు అరచెక్క నిమ్మకాయపై కాస్త బేకింగ్‌ సోడా చల్లి లోపల ఉంచితే వాసన ఉండదు

గులాబీ, చామంతి, గోవర్ధన, టొమాటో, పాలకూర వంటి మొక్కలు ఆమ్లతత్వం ఎక్కువగా ఉన్న నేలల్లో బాగా పెరుగుతాయి. వాడేసిన నిమ్మ తొక్కల్ని మెత్తగా నూరి మట్టిలో కలిపితే మొక్కలు ఏపుగా ఎదుగుతాయి