నిమ్మచెక్కలు పడేస్తున్నారా? ఇకపై పడేయకండి..

February  6, 2024

TV9 Telugu

నిమ్మకాయలను సీజన్‌తో సంబంధం లేకుండా ఎప్పుడైనా, ఎలాంటి సందర్భంలోనైనా ఉపయోగిస్తుంటాం. నిమ్మకాయల నుంచి రసం పిండుకున్న తర్వాత వాటి చెక్కలను చాలామంది బయట పడేస్తుంటారు

కానీ నిమ్మ చక్కలు ఇలా వృధాగా పడేయడం కన్నా వాటిని కూడా పలు రకాలుగా ఉపయోగించుకోవచ్చు. ఫలితంగా డబ్బు కూడా ఆదా అవుతుంది. అదెలాగో ఇక్కడ చూద్దాం..

బీట్‌రూట్, స్ట్రాబెర్రీ, నేరేడు వంటి పండ్లను కట్‌ చేస్తున్నప్పుడు చేతులు రంగు మారుతుంటాయి. సబ్బుతో ఎంత కడిగిన అవి ఓ పట్టాన వదలవు. ఆ మరకలు పోవాలంటే నిమ్మచెక్కను ఉపయోగించవచ్చు

నిమ్మచెక్కతో చేతులను రుద్దుకుంటే చేతుల రంగు ఇట్టే వదిలిపోతుంది. అలాగే జిడ్డుగా మారిన వంటింటి సింకును నిమ్మచెక్కతో రుద్దితే మార్పు స్పష్టంగా కనిపిస్తుంది. తళతళలాడి పోవాల్సిందే

చెమట వల్ల బూట్లు దుర్వాసన వస్తుంటాయి. ప్రతిసారీ బూట్లను ఉతకడం వీలుపడదు. అలాంటప్పుడు ఎండబెట్టిన నిమ్మచెక్కలని బూట్లలో వేసి ఉంచితే సరి.. దుర్వాసన ఇట్టే మాయం అవుతుంది

తువాళ్లకు ఉండే మరకలు ఎంత ఉతికినీ ఒక పట్టాన వదలవు. నిమ్మతొక్కలు, వంటసోడా వేసిన నీటిలో తువాళ్లను నానబెట్టి ఉతికి చూడండి.. మరకలన్నీ మాయం అయ్యి తెల్లబడతాయి

వాడేసిన నిమ్మచెక్కలని ఉప్పులో ముంచి వాటితో కాయగూయలు కట్‌ చేసే బోర్డుని రుద్దితే మరకలు శుభ్రం అవుతాయి. బొర్డు నీట్‌గా కనిపిస్తుంది

వెనిగర్‌లో నిమ్మతొక్కలను వేసి రాత్రంతా నానబెట్టుకోవాలి. మరుసటి రోజున దీనిలో కాసిన్ని నీళ్లు కలిపి ఓ సీసాలో తీసుకుని ఇంటి అద్దాలు, స్నానాల గదుల గోడలపై స్ప్రే చేసి శుభ్రం చేసుకోవచ్చు