TV9 Telugu
30 March 2024
ఇవి కూడా థైరాయిడ్ లక్షణాలే..
థైరాయిడ్ హార్మోన్లు పడిపోయినప్పుడు శరీరంలో కొలెస్ట్రాల్ పెరుగుతుంది. ఉన్నపలంగా బరువు పెరిగే వెంటనే పరీక్షలు నిర్వహించుకోవాలి.
కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ కారణంగా రక్తంలో కొలెస్ట్రాల్ మోతాదులు పెరిగిపోతాయి. దీనికి కూడా థైరాయిడ్ కారణంగా చెబుతున్నారు.
ఇక హైపోథైరాయిడిజమ్‌తో రక్తం పరిమాణం పెరిగి, గుండె కండర సంకోచాలు బలహీనమవుతాయి. దీంతో గుండె వేగం నెమ్మదిస్తుంది.
థైరాయిడ్ హార్మోన్లు తగ్గడం వల్ల పేగుల కదిలకల్లో మార్పులు వస్తాయి. పేగు కదలికలు నెమ్మదించడంతో మలబద్ధకం సమస్య వస్తుంది.
కొన్ని సందర్భాల్లో థైరాయిడ్ కారణంగా కీళ్లు, కండరాల నొప్పులు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. కాళ్లలోని కండరాల నొప్పలు తలెత్తుతాయి.
థైరడాయ్ పనితీరులో సమస్యల కారణంగా కుంగుబాటు సమస్య కూడా వచ్చే అవకాశం ఉంటుంది. డిప్రెషన్ బారిన పడితే వైద్యులను సంప్రదించడం మరువద్దు.
జ్ఞాపకశక్తి తగ్గటం, ఏకాగ్రత కుదరకపోవటం, నిర్ణయాలు సరిగా తీసుకోలేకపోవటం కూడా హైపోథైరాయిడిజమ్ లక్షణాలు కావొచ్చని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
ఇక్కడ క్లిక్ చేయండి..