కిడ్నీల్లో రాళ్లు ఏర్పడినప్పుడు శరీరంలో కొన్ని రకాల మార్పులు జరుగుతాయి. వీటిని కొన్ని లక్షణాల ద్వారా ముందుగానే గుర్తించవచ్చు.
కిడ్నీలో రాళ్ల ఉంటే.. మూత్ర విసర్జన చేసే సమయంలో విపరీతమైన నొప్పి వస్తుంది. దీనినే డైసూరియా అని పిలుస్తారు.
ఇక మూత్రంలో రక్తం వస్తుంటే కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీనిని హెటూరియా అంటారు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
ఒకవేళ కిడ్నీలో రాళ్ల సమస్య ఉంటే.. మూత్రం చిక్కగా, దుర్వాసనతో ఉంటుంది. కాబట్టి ఈ లక్షణం కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి.
కిడ్నీల్లో రాళ్లు ఉంటే.. తరచూ జ్వరం సమస్య వేధిస్తుంటుంది. ఒకవేళ జ్వరం ఎంతకీ తగ్గకపోతే, కిడ్నీల్లో రాళ్లు ఉన్నట్లు అనుమానించాలి.
వికారం, వాంతులు వంటి లక్షణాలు దీర్ఘకాలంగా ఉన్నా కిడ్నీల్లో రాళ్లు వచ్చినట్లు భావించాలి. పొత్తి కడుపులో నొప్పి వేధిస్తున్నా.. వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కిడ్నీలో రాళ్లు ఏర్పడితే విపరీతమైన నడుము నొప్పి ఉంటుంది. నడవడం, నిలబడడం ఇబ్బందిగా ఉంటే కిడ్నీల్లో రాళ్లు ఉన్నాయని భావించాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.