ఈ లక్షణాలున్నాయా.? కడుపు క్యాన్సర్‌ కావొచ్చు. 

16 November 2023

సాధారణంగా కడుపు లైనింగ్ లోపల క్యాన్సర్‌ కణాలు పెరుగుతుంటాయి. ఇలా జరిగినప్పుడు కడుపు క్యాన్సర్‌ వస్తుంది. దీనిని గ్యాస్ట్రిక్‌ క్యాన్సర్‌ అని కూడా పిలుస్తుంటారు. 

కడుపు క్యాన్సర్‌ పెరగడానికి సాధారణంగా ఏళ్లు పడుతుంది. అయితే ప్రారంభ దశలోనే కడుపు క్యాన్సర్‌ను గుర్తిస్తే త్వరలోనే అడ్డుకట్ట వేయొచ్చు. 

కడుపులో క్యాన్సర్‌ ప్రారంభ దశలో ఉన్నట్లైతే.. వాంతులు, వికారం అనుభూతి ఉంటాయి. చాలా కాలంగా ఇలాంటి సమస్య వెంటాడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

ఇక కడుపులో ఉబ్బరంగా ఉండడం సాధారణమైన విషయమే. అయితే ఎక్కువ కాలం నుంచి ఇదే సమస్య ఉంటే మాత్రం కడుపు క్యాన్సర్‌గా సూచికగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. 

తక్కువ భోజనం చేసినా కడుపు నిండిన భావన కలిగితే ఏదో తేడా కొడుతోందని భావించాలి. ఎక్కువ కాలం ఇదే సమస్య వెంటాడితే తప్పక జాగ్రత్తపడాలి. 

కడుపులో క్యాన్సర్‌ కణాలు వృద్ధి చెందితే సదరు వ్యక్తికి నిత్యం జ్వరం వచ్చినట్లు అనిపిస్తుంది. దీర్ఘకాలం జ్వరం తగ్గపోయినా, కడుపులో నొప్పి ఉన్నా పరీక్షలు చేయించుకోవాలి. 

ఇక కడుపు క్యాన్సర్‌ను ముందుస్తుగానే తెలిపే మరో ప్రధాన లక్షణం.. మలంలో రక్తం పడడం. ఇలాంటి పరిస్థితి వచ్చిన వెంటనే వైద్యులను సంప్రదించాలి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం కోసం మాత్రమే. ఆరోగ్యం విషయంలో నిపుణులు సూచనలు పాటించడమే ఉత్తమం.