దీర్ఘకాలంగా ఛాతినొప్పితో ఇబ్బంది పడుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు చెబుతున్నారు. ముఖ్యంగా ఊపిరి పీల్చినప్పుడు నొప్పిగా ఉంటే లంగ్ ఇన్ఫెక్షన్ ఉన్నట్లే.
కఫం ఎక్కువగా వస్తున్నా ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఉందని అర్థం చేసుకోవాలి. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని సూచిస్తున్నారు.
ఎలాంటి డైటింగ్, వ్యాయామం చేయకపోయినా ఉన్నట్లుండి బరువు తగ్గితే కూడా లంగ్ ఇన్ఫెక్షన్‌గా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇది అనారోగ్యానికి సూచికగా భావించాలి.
శ్వాస తీసుకోవడం ఇబ్బందులు ఎదురవుతుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ ఎదురైనప్పుడే ఈ సమస్య వస్తుందని చెబుతున్నారు.
ఎనిమిది వారాలకు మించి నిరంతరంగా దగ్గు వస్తుంటే వెంటనే అలర్ట్ అవ్వాలి. ఎడతెరపిలేకుండా వచ్చే దగ్గు ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు ముందస్తు లక్షణంగా భావించాలి.
ఎక్కువ కాలం పాటు జ్వరం ఉండి, చెమట, చలి, నిత్యం జలుబుతో బాధపడుతున్నా లంగ్ ఇన్ఫెక్షన్‌గా భావించాలని చెబుతున్నారు.
గురక సర్వసాధారణమే అయినా కొందరిలో లంగ్ ఇన్ఫెక్షన్ కారణంగా కూడా ఈ సమస్య వస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాబట్టి గురకను లైట్ తీసుకోవద్దని సూచిస్తున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.