లివర్‌లో ఏదైనా సమస్య తలెత్తితే జీర్ణ క్రియలు సరిగ్గా ఉండవని నిపుణులు చెబుతున్నారు. తిన్నది జీర్ణం కాకపోవడం, ఆకలి లేకపోవడం వంటివి లివర్ సమస్యలకు లక్షణంగా చెప్పొచ్చు.
లివర్‌లో లోపం ఉంటే మానసిక ఆరోగ్యంపై కూడా ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. డిప్రెషన్, యాంగ్జైటీ వంటి లక్షణాలకు లివర్‌లో తలెత్తే సమస్యలే కారణమని అంటున్నారు.
నిత్యం తలనొప్పితో బాధపడుతున్నా లివర్ సమస్యగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా తలనొప్పి వేధిస్తుంటే లివర్ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు.
లివర్ డ్యామేజ్ అయ్యేముందు కీళ్ల నొప్పుల సమస్యలు మొదలవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే కీళ్ల నొప్పులు ఉంటే లివర్ పరీక్షలు చేయించుకోవాలి.
కొన్ని సందర్భాల్లో లివర్‌లో సమస్యలుంటే మలబద్ధకానికి దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా మలబద్ధకం వేధిస్తే అలర్ట్ అవ్వాలని చెబుతున్నారు.
తీవ్ర అలసట వేధిస్తున్నా లివర్ పనితీరులో ఏదో తేడా ఉందని అర్థం చేసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వెంటనే అలర్ట్ అవ్వాలి.
కొన్ని సందర్భాల్లో మొహానికి పింపుల్స్ కూడా కాలేయ సమస్యకు లక్షణంగా చెప్పొచ్చు. మెటిమలు ఎక్కువైతే లివర్ టెస్ట్ చేసుకోవాలని చెబుతున్నారు.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడే ఉత్తమం.