27 May 2024

శృంగారంపై ఆసక్తి తగ్గడం  కూడా ఆ వ్యాధి లక్షణమే..

Narender.Vaitla

డయాబెటిస్‌ సమస్య ఉన్నా కూడా చాలా మందికి తెలియడంలేదని పలు అధ్యయనాలు చెబుతున్నారు. దీనికి ప్రధాన కారణంగా మొదట్లో పెద్దగా లక్షణాలు కనిపించకపోవడమేనని నిపుణులు చెబుతున్నారు.

మధుమేహం ఉన్న వారిలో కనిపించే ప్రధాన లక్షణం అతిగా దాహం వేయడం ఒకటి. నోరు ఎప్పుడు ఎండిపోతున్నా, విపరీతంగా ఆకలి వేస్తున్నా అది డయాబెటిస్‌ లక్షణంగా భావించాలి.

ఇక నీరు ఎక్కువగా తీసుకోకపోయినా.. నిత్యం మూత్రం వస్తున్నా డయాబెటిస్‌ తాలుకూ లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఇలాంటి లక్షణం కనిపిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలని చెబుతున్నారు.

కొన్ని సందర్భాల్లో ఉన్నపలంగా బరువు తగ్గినా అది డయాబెటిస్‌కు ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి. 

రక్తంలో గ్లూకోజ్‌ మోతాదు పెరుగుతున్న కొద్దీ తలనొప్పి సమస్యల వేధింస్తుంటుంది. దీర్ఘకాలంగా తలనొప్పి సమస్య వేధిస్తుంటే వెంటనే పరీక్షలు చేయించుకోవాలని నిపుణులు చెబుతున్నారు.

కళ్లు మసక బారటం కూడా డయాబెటిస్‌ ప్రాథమిక లక్షణాల్లో ఒకటని నిపుణులు చెబుతున్నారు. రక్తంలో గ్లూకోజ్‌ స్థాయి పెరిగితే కనిపించే తొలి లక్షణాల్లో ఇదీ ఒకటి.

ఇక మధుమేహం కారణంగా శృంగారంపై కూడా ఆసక్తి తగ్గుతుందని నిపుణులు చెబుతున్నారు. మగవారిలో అంగ స్తంభన లోపం, ఆడవారిలో యోని పొడిబారడం వంటి లక్షణాలు కనిపిస్తాయని అంటున్నారు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం