రాత్రి ఈ లక్షణాలు కనిపిస్తే.. డయాబెటిస్ కావొచ్చు.
Narender.Vaitla
రాత్రుళ్లు మూత్ర విసర్జన కోసం తరచూ లేస్తుంటే డయాబెటిస్ ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ రోజులు ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
కాళ్లలో తిమ్మిర్లు ఎక్కువగా రావడం కూడా డయాబెటిస్ లక్షణంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. చక్కెర స్థాయిలు పెరగడం వల్ల నరాలు దెబ్బతిని కాళ్ల తిమ్మిర్లు వస్తాయి.
రాత్రుళ్లు ఎక్కువగా అలసట ఉన్నా షుగర్ వ్యాధి వచ్చి ఉండొచ్చని అర్థం చేసుకోవాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. నిద్రలేమితో పాటు నీరసం కూడా ఉంటుంది.
రాత్రి పడుకున్న సమయంలో శ్వాస తీసుకోవడంలో ఇబ్బందులు ఏర్పడితే రక్తంలో షుగర్ లెవల్స్ పెరిగి ఉండొచ్చని అర్థం చేసుకోవాలి. ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని చెబుతున్నారు.
కాలంతో సంబంధం లేకుండా ఎక్కువగా దాహం వేస్తున్నా డయాబెటిస్ లక్షణంగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. కాబట్టి ఈ సమస్య కనిపిస్తే వెంటనే పరీక్షలు చేయించుకోవాలి.
వాతావరణం చల్లాగా ఉన్నా రాత్రుల్లు ఎక్కువగా చెమటలు వస్తుంటే అది కూడా డయాబెటిస్ లక్షణంగా భావించాలి. ఇలాంటి సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పురుషుల్లో శృంగార కోరికలు తగ్గితే కూడా మధుమేం ప్రాథమిక లక్షణంగా భావించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఈ సమస్య ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించి సంబంధిత చికిత్స చేయించుకోవాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.