ఉదయం లేవగానే ఈ లక్షణాలున్నాయా.?
09 September 2023
ఉదయం నిద్రలేవగానే నోరు పొడబారినట్లు ఉంటే చక్కెర స్థాయిలు పెరుగుతున్నాయని భావించాలి. ఎక్కువ కాలం ఈ సమస్య వేధిస్తే వెంటనే అలర్ట్ అవ్వాలి.
రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగితే కొన్ని సందర్భాల్లో ఉదయం లేవగానే వికారంగా అనిపిస్తుంది. ఇది టైప్ 1డయాబెటిస్‌కు సూచిక కావొచ్చు.
అంతేకాకుండా కొన్ని సందర్భాల్లో గొంతులో మంటగా ఉంటుంది. నమలడం లేదా మింగడంలో ఇబ్బంది ఉన్నా వెంటనే అలర్ట్ అవ్వాలి.
షుగర్ వ్యాధితో బాధపడే వారికి కొన్ని సందర్భాల్లో తిమ్మిరి, నొప్పులు సంభవిస్తాయి. ఈ లక్షణం కనిపిస్తే వెంటనే వైద్యుడ్ని సంప్రదించాలి.
ఇక విపరీతైమన కీళ్ల నొప్పులు, కాళ్లలో బలహీనత, బాడీ పెయిన్స్ కూడా షుగర్ లెవల్స్ పెరిగాయన్నాడనికి సూచనగా చెప్పొచ్చు.
ఇక కొందరిలో ఉదయం లేవగానే మసకగా అనిపిస్తుంది. అయితే దృష్టిలోపం వల్ల ఈ సమస్య వచ్చినా కొన్ని సందర్భాల్లో షుగర్ లెవల్స్ పెరిగినా లక్షణం కని
పిస్తుంది.
నోరు పొడబారిపోవడం వల్ల చెడు శ్వాస, పెదాలు పగిలిపోవడం, నోట్లో పుండు వంటి లక్షణాలు కనిపిస్తాయని నిపుణులు చెబుతున్నారు.
పైన తెలిపిన అంశాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యం విషయంలో వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.
లైఫ్ స్టైల్ స్టోరీల కోసం క్లిక్ చేయండి..