నోటిలో తరచూ పుండ్లు ఏర్పడుంటే వెంటనే అలర్ట్ అవ్వాలని నిపుణులు చెబుతున్నారు. ఇది క్యాన్సర్ వచ్చే ముందు కనిపించే లక్షణాల్లో ఒకటని చెబుతున్నారు.
ఇక తరచూ జీర్ణ సంబంధిత సమస్యలతో బాధపడుతున్నా క్యాన్సర్ లక్షణంగా భావించాలని నిపుణులు అంటున్నారు. ముఖ్యంగా మలబద్ధకం వేధిస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
నాలుకపై తెల్లని మచ్చలు కనిపిస్తుంటే క్యాన్సర్‌కు ముందు కనిపించే లక్షణంగా అనుమానించవచ్చు. కాబట్టి నాలుకపై తెల్ల మచ్చలు కనిపిస్తే వెంటనే వైద్యుడిని సంప్రదించి సంబంధిత పరీక్షలు చేయించుకోవాలి.
శరీరంలో ఎక్కడైనా గడ్డలు ఏర్పడుతున్నా. రక్తం ఆగినట్లు భావన కలిగినా వెంటనే డాక్టర్లను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని అంటున్నారు.
ఏ పని చేయకపోయినా ఊరికే అలసిపోతుంటే కూడా క్యాన్సర్ లక్షణంగా భావించాలని వైద్యులు హెచ్చరిస్తున్నారు. శరీరం నిత్యం నీరసంగా ఉంటే అలర్ట్ అవ్వాలి.
చర్మం రంగులో ఏమాత్రం మార్పు కనిపిస్తున్నా వెంటనే వైద్యులను సంప్రదించాలని అంటున్నారు. ముఖ్యంగా చర్మంపై దద్దుర్లు, నలుపు రంగు కనిపిస్తే పరీక్షలు చేయించుకోవాలి.
ఎడతెరిపి లేకుండా దగ్గు సమస్యతో బాధపడుతుంటే కూడా జాగ్రత్త పడాలని నిపుణులు చెబుతున్నారు. ఎక్కువ రోజులు దగ్గు వస్తుంటే వెంటనే వైద్యులను సంప్రదించాలి.
పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.