24 May 2024

ఈ లక్షణాలు ఉంటే.. కాల్షియం లోపించినట్లే 

Narender.Vaitla

కండరాల పనితీరులో కాల్షియం ముఖ్యపాత్ర పోషిస్తుంది. కాల్షియం లోపిస్తే నీరసంగా అనిపించడం, అలాగే ఏదైనా పని చేస్తున్నప్పుడే కాదు, విశ్రాంతి తీసుకున్నప్పుడు కూడా కాళ్లు, పాదాలు, చేతుల్లోని కండరాలలో తిమ్మిరిగా అనిపిస్తాయి.

కాల్షియం తగ్గడం వల్ల నాడీ వ్యవస్థపై తీవ్ర ప్రభావం పడుతుంది. దీంతో శరీరం జలదరించినట్టు, వేళ్లు, కాళ్లు, పెదవులు చివర సూదులతో పొడిచినట్టు అనిపిస్తుంది.

ఇక శరీరంలో తగినంత కాల్షియం తగ్గితే.. గోళ్లు పెళుసుగా మారిపోతాయని, గోళ్ల చివర్లు విరిగిపోతూ, చీలిపోతూ ఉంటాయని  నిపుణులు చెబుతున్నారు.

శరీరంలో తగినంత కాల్షియం లేకపోతే దంతక్షయంకు దారి తీస్తుందని నిపుణులు చెబుతున్నారు. కాల్షియం తగినంత అందకపోతే ఎనామిల్ దెబ్బతింటుంది. దీంతో దంతాలు త్వరగా ఊడిపోతాయి

బలమైన ఎముకల కోసం కాల్షియం ఎంతో అవసరపడుతుంది. దీర్ఘకాలికంగా కాల్షియం లోపిస్తే ఎముక బలహీనంగా మారుతుందని.. దీనివల్ల ఆర్థరైటిస్ వంటి వ్యాధులు రావచ్చని నిపుణులు చెబుతున్నారు.

గుండె కొట్టుకునే వేగాన్ని నియంత్రించే శక్తి కాల్షియంకు ఉంటుంది. కాల్షియం స్థాయి తక్కువగా ఉంటే.. గుండె లయలో అంతరాయాలు ఏర్పడతాయని నిపుణులు చెబుతున్నారు.

కాల్షియం లోపం నుంచి బయట పడాలంటే.. తీసుకునే ఆహారంలో పాలు, పెరుగు, చీజ్‌ వంటివి కచ్చితంగా ఉండేలా చూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే బాదం, సోయా కూడా ఉండేలా చూసుకోవాలి. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.