ఈ లక్షణాలుంటే.. క్యాల్షియం లోపం ఉన్నట్లే

27 December 2023

శరీరంలో సరిపడ క్యాల్షియం లేకపోతే ఎముకలు, దంతాలు బలహీనపడతాయి. అయితే క్యాల్షియం తగ్గినట్లు ముందుగానే గుర్తిస్తే నివారణ చర్యలు చేపట్టవచ్చు. 

శరీరంలో క్యాల్షియం సరిపడలేకపోతే.. కండరాల నొప్పులు ఎక్కువగా కనిపిస్తాయి. దీర్ఘకాలంగా కండరాల నొప్పులు వేధిస్తే వెంటనే అలర్ట్‌ అవ్వాలి. 

చాలా మందిలో వణుకుడు సమస్య ఉంటుంది. చేతులు వాటంతటవే వణుకుతుంటాయి. ఇది కూడా క్యాల్షియం లోపంగానే భావించాలని నిపుణులు చెబుతున్నారు. 

ఇక క్యాల్షియం లోపం మానసిక ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. ప్రతీ చిన్న విషయానికి డిప్రెషన్‌లోకి వెళితే క్యాల్షియం లోపంగా భావించాలి. 

త్వరగా అలసిపోతున్నా, నీరసంగా ఉంటున్నా క్యాల్షియం లోపంగా భావించాలని నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలంగా ఈ సమస్య ఉంటే వెంటనే అలర్ట్‌ అవ్వాలని చెబుతున్నారు. 

ఇక ఉన్నపలంగా ఆకలి తగ్గినా, ఏం తిన్నా కడుపులో వికారంగా ఉంటున్నా శరీరంలో తగినంత క్యాల్షియం లేదని అర్థం. ఇలాంటి లక్షణాలు కనిపిస్తే వైద్యులను సంప్రదించాలి. 

వేళ్లు, పాదాలు, కాళ్లలో తిమ్మిరి, జలదరింపు లాంటి సమస్యలకు ఎదురైనా క్యాల్షియం లోపంగా భావించాలి. అలాగే గోర్లు పెళుసుగా మారినా క్యాల్షియం లోపం ఉన్నట్లు. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.