ఎండు కొబ్బరి తినడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే.. వదిలిపెట్టరు కదా 

28July 2024

TV9 Telugu

Pic credit - GETTY

పూజ నుండి వంట వరకు అన్నింటిలోనూ ఎండు కొబ్బరిని ఉపయోగిస్తారు. చాలామంది దీనిని ఖీర్, హల్వా, ఐస్ క్రీం, తీపి వంటకాలు చేయడానికి ఉపయోగిస్తారు.

ఎండు కొబ్బరి

విటమిన్ బి6, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, కాపర్, ఫాస్పరస్, పొటాషియం, యాంటీ ఆక్సిడెంట్లు వంటి పోషకాలు ఎండు కొబ్బరిలో పుష్కలంగా ఉన్నాయి.

పోషకాలు

ఎండు కొబ్బరి తినడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు లభిస్తాయి. అయితే దీని స్వభావం వేడిని కలిగిస్తుంది. కనుక ఎండు కొబ్బరిని తక్కువ పరిమాణంలో మాత్రమే తినాలి.

అనేక ఆరోగ్య ప్రయోజనాలు

ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల రక్తహీనత సమస్య నుంచి ఉపశమనం లభిస్తుంది. ఇందులో ఐరన్ పుష్కలంగా ఉంటుంది. రక్తంలో హిమోగ్లోబిన్ స్థాయిని పెంచడంలో సహాయపడుతుంది.

రక్తహీనతను తొలగిస్తుంది 

ఎండు కొబ్బరిలో పోషకాలు, యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. దీన్ని తినడం వల్ల శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది.

రోగనిరోధక శక్తి

ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల గుండె ఆరోగ్యానికి ఎంతో మేలు జరుగుతుంది. ఇందులో యాంటీఆక్సిడెంట్లు పుష్కలంగా ఉన్నాయి. ఇవి ఆక్సీకరణ నష్టాన్ని నివారిస్తాయి.

గుండె ఆరోగ్యం కోసం 

ఎండు కొబ్బరిని తీసుకోవడం వల్ల క్యాన్సర్ వంటి ప్రాణాంతక వ్యాధుల ప్రమాదాన్ని తగ్గించుకోవచ్చు. ఎండు కొబ్బరిలో చాలా పోషకాలు రొమ్ము క్యాన్సర్, ప్రోస్టేట్ క్యాన్సర్ కణాలు ఏర్పడకుండా నిరోధిస్తాయి. 

క్యాన్సర్ నివారిణి