మునగాకుతో మొటిమలకు ఇలా చెక్‌ పెట్టేద్దాం..

09 August 2023

Pic credit - Pexels

మునగాకులో విటమిన్‌ ఎ, విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. అలాగే ఐరన్‌, క్యాల్షియం పోషకాలు కూడా అధికంగా ఉంటాయి.

మునగాకు ఉండే క్లోరోజెనిక్‌ యాసిడ్‌ రక్తంలోని చక్కెర స్థాయులను నియంత్రణలో ఉంచడంలో సహాయపడుతుంది. దీంతో షుగర్ లెవల్స్ అదుపులో ఉంటాయి

గుప్పెడు మునగాకు తీసుకుని నీళ్లలో వేసి బాగా శుభ్రం చేసుకోవాలి. అనంతరం లీటరు నీటిలో వేసి బాగా మరిగించాలి.

ఆ తర్వాత చల్లార్చి కాస్త ఉప్పు, మిరియాలపొడి, నిమ్మరసం వేసి క్రమం తప్పకుండా తాగితే ఆస్తమా తగ్గుముఖం పడుతుంది

ముందుగా మునగాకు ఆకుల్ని తీసుకుని శుభ్రంగా కడగాలి. ఆతర్వాత మునగాకుల్ని వేడి నీటిలో వేసి మూత పెట్టాలి. 

అరగంట తర్వాత మరిగిన నీటిలో కాస్త నిమ్మరసం పిండి ఖాళీ కడుపుతో తాగితే పీసీఓడీ సమస్య నుంచి ఉపశమనం పొందవచ్చు.

టేబుల్‌ స్పూన్‌ మునగాకు రసంలో, ఒక టేబుట్ స్పూన్ నిమ్మరసాన్ని వేసుకుని రెండూ బాగా కలిసిపోయేంత వరకూ కలపాలి 

ఈ మిశ్రమాన్ని ముఖానికి రాస్తే మొటిమల సమస్యకు చెక్ పెట్టొచ్చు. బ్లాక్‌హెడ్స్‌ కూడా తగ్గి ముఖం ప్రకాశవంతంగా ఉంటుంది.