మునక్కాయను అస్సలు వదలకండి.. 

Narender Vaitla

03 November 2024

మునక్కాయలో విటమిన్‌ సి పుష్కలంగా ఉంటుంది. ఇది శరీర రోగ నిరోధక శక్తిని పెంచడంలో కీలక పాత్ర పోషిస్తుంది. ఇది వ్యాధుల నుంచి రక్షించడంలో కీలక పాత్ర పోషిస్తుంది.

బీపీతో బాధపడేవారు రెగ్యులర్‌గా మునక్కాయను తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. ఇందులోని పొటాషియం రక్తనాళాలను ఆరోగ్యంగా ఉంచుతుంది. దీంతో ఇది గుండె సంబంధిత సమస్యలను దూరం చేయడంలో సహాయపడుతుంది.

మునక్కాయల్లో కాల్షియం పుష్కలంగా ఉంటుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చడంలో ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ఎదిగే పిల్లలకు ఎంతో ఉపయోగపడుతుంది.

జీర్ణ సంబంధిత సమస్యలను దూరం చేయడంలో కూడా మునక్కాయ కీలక పాత్ర పోషిస్తుంది. ఇందులోని ఫైబర్‌ కంటెంట్‌ మలబద్ధకం, అజీర్తి వంటి సమస్యలను తగ్గిస్తుంది.

మునక్కాయల్లో యాంటీ ఆక్సిడెంట్స్‌ పుష్కలంగా ఉంటాయి. ఇవి చర్మ ఆరోగ్యాన్ని కాపాడడంలో ముఖ్యపాత్ర పోషిస్తాయి. చర్మం యవ్వనంగా ఉండేలా చేస్తాయి.

రెగ్యులర్‌గా మునక్కాయలను తీసుకోవడం వల్ల క్యాన్సర్‌ సమస్య దరిచేరదని నిపుణులు అంటున్నారు. ఇందులోని యాంటీ ఆక్సిడెంట్స్‌ క్యాన్సర్‌ కణాలను నాశనం చేస్తుంది.

మునక్కాయలను క్రమంతప్పకుండా తీసుకోవడం వల్ల కిడ్నీ సంబంధిత సమస్యలు దరిచేరవని నిపుణులు అంటున్నారు. కిడ్నీలో రాళ్లు వచ్చే ముప్పు తగ్గుతుంది. 

పైన తెలిపిన విషయాలు కేవలం ప్రాథమిక సమాచారం మేరకు మాత్రమే. ఆరోగ్యానికి సంబంధించి వైద్యుల సూచనలు పాటించడమే ఉత్తమం.